Shubman Gill : ఓ పక్క లవ్.. మరో పక్క క్రికెట్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్న శుభమన్.. సారాతో సందడి చేసిన ప్రిన్స్
యువరాజ్ సింగ్ ఛారిటీ డిన్నర్‌లో భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో కలిసి కనిపించడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. వారిద్దరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాత లవ్ రూమర్స్ మళ్ళీ ఊపందుకున్నాయి.

Shubman Gill : భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన యువీక్యాన్ ఫౌండేషన్ కోసం జులై 8, 2025న లండన్‌లో ఒక ఛారిటీ డిన్నర్‌ను ఏర్పాటు చేశాడు. ఈ విందులో క్రికెట్ ప్రపంచంలోని అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడానికి, చికిత్స కోసం నిధులు సేకరించడానికి ఈ డిన్నర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విందుకు భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన టీమ్ మొత్తంతో కలిసి వచ్చాడు. ఈ నేపథ్యంలో శుభమన్ గిల్ ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ గిల్‌తో కలిసి కనిపించడం మళ్ళీ చర్చకు దారితీసింది.
క్యాన్సర్ మహమ్మారిని జయించిన తర్వాత యువరాజ్ సింగ్ 2011లో యువీక్యాన్ ఫౌండేషన్‌ను స్థాపించాడు. ఈ ఫౌండేషన్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి, ముందుగానే గుర్తించడాన్ని ప్రోత్సహించడానికి, రోగులకు ఆర్థిక సహాయం అందించేందుకు పనిచేస్తుంది. దానిలో భాగంగానే లండన్‌లో జరిగిన ఈ ఛారిటీ డిన్నర్ లక్ష్యం ఫౌండేషన్ కోసం నిధులను సేకరించడం. ఇప్పుడు ఈ కార్యక్రమంలో శుభ్‌మన్ గిల్, సారా టెండూల్కర్ కనిపించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Gill
వైరల్ అవుతున్న ఫోటోలో శుభ్‌మన్ నవ్వుతూ కనిపించాడు. సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ అతని ముందు కూర్చుని ఉంది. అయితే, ఈ ఫోటో గిల్ తన జట్టుతో విందుకు వచ్చినప్పుడు, సారా అప్పటికే అక్కడ ఉన్నప్పుడు తీసినది అని చెబుతున్నారు. సారా టెండూల్కర్ ఈ ప్రోగ్రాం ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. అందులో ఆమె తన ఫ్రెండ్స్‌తో కనిపించింది.
శుభ్‌మన్ గిల్ పేరు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో చాలాసార్లు వినిపించింది. ఒకానొక సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉన్నట్లు వదంతులు ప్రచారంలోకి వచ్చాయి. దీనికి బలం చేకూర్చేలా ఇద్దరూ గతంలో సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అయ్యేవారు. అలాగే, పరస్పరం పోస్ట్‌లకు లైక్ చేయడం, కామెంట్ చేయడం కూడా జరిగేది. కానీ ఆ తర్వాత ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం ద్వారా వదంతులకు తెర దించారు. అయితే, శుభ్‌మన్, సారా ఈ వదంతుల గురించి ఇప్పటివరకు బహిరంగంగా నోరు విప్పలేదు.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..




