BAN vs IND: టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. వైట్‌వాష్ నుంచి టీమిండియా బయటపడేనా.. ప్లేయింగ్‌ 11 ఇదే..

|

Dec 10, 2022 | 11:16 AM

తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్ కోల్పోయిన టీమిండియా.. మూడో మ్యాచ్‌లో గెలిచి క్లీన్‌స్వీప్‌ను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో బంగ్లాదేశ్ జట్టు తొలిసారిగా వరుసగా 3 వన్డేల్లో విజయం సాధించాలనే ఉద్దేశంతో భారత్‌పై రంగంలోకి దిగనుంది.

BAN vs IND: టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. వైట్‌వాష్ నుంచి టీమిండియా బయటపడేనా.. ప్లేయింగ్‌ 11 ఇదే..
Team India
Follow us on

భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ నేడు చిట్టగాంగ్ వేదికగా జరుతుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్ కోల్పోయిన టీమిండియా.. మూడో మ్యాచ్‌లో గెలిచి క్లీన్‌స్వీప్‌ను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో బంగ్లాదేశ్ జట్టు తొలిసారిగా వరుసగా 3 వన్డేల్లో విజయం సాధించాలనే ఉద్దేశంతో భారత్‌పై రంగంలోకి దిగనుంది.

గాయం కారణంగా బంగ్లాదేశ్ పర్యటనకు దూరమైన రోహిత్ శర్మ స్థానంలో లోకేశ్ రాహుల్ భారత కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. భారత ఆటగాళ్లు దీపక్ చాహర్, కుల్దీప్ సేన్ కూడా గాయం కారణంగా మూడో మ్యాచ్‌కు దూరమయ్యారు.

లోకేశ్ రాహుల్ కెప్టెన్సీలో భారత్ 50% విజయాల రికార్డును కలిగి ఉంది. రాహుల్ కెప్టెన్సీలో భారత్ 6 వన్డేలు ఆడింది. 3 మ్యాచ్‌ల్లో గెలిచి 3 మ్యాచుల్లో ఓడిపోయింది. ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేల్లో తొలిసారి భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత 3-0తో సిరీస్‌ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. తర్వాత ఆగస్టు 2022లో, అతని కెప్టెన్సీలో, జట్టు 3-0తో జింబాబ్వేను ఓడించింది.

ఇవి కూడా చదవండి

రాహుల్ టెస్టు, టీ20ల్లో ఒక్కోసారి జట్టుకు నాయకత్వం వహించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన టీ20లో 101 పరుగుల తేడాతో గెలిచింది.

ఇరు జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (w/c), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): అనాముల్ హక్, లిట్టన్ దాస్(సి), షకీబ్ అల్ హసన్, యాసిర్ అలీ, ముష్ఫికర్ రహీమ్(w), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, ఎబాడోత్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..