T20 Cricket: కేకేఆర్ రూ.50 లక్షల ప్లేయర్ ఊచకోత.. 10 ఫోర్లు, 3 సిక్సులు, 202 స్ట్రైక్‌రేట్‌తో రికార్డ్ హాఫ్ సెంచరీ..

IPL 2023లో తొలిసారి ఆడనున్న బంగ్లాదేశ్ తుఫాన్ టీ20 ప్లేయర్ లిటన్ దాస్.. గత కొన్ని నెలలుగా అద్భుతమైన ఫామ్‌తో దూసుకపోతున్నాడు. నిరంతరం పరుగులు సాధిస్తున్నాడు. ఈ క్రమంలో KKRకి ఓ శుభవార్త అందింది.

T20 Cricket: కేకేఆర్ రూ.50 లక్షల ప్లేయర్ ఊచకోత.. 10 ఫోర్లు, 3 సిక్సులు, 202 స్ట్రైక్‌రేట్‌తో రికార్డ్ హాఫ్ సెంచరీ..
Kkr Ipl 2023
Follow us
Venkata Chari

|

Updated on: Mar 29, 2023 | 6:01 PM

IPL 2023 సీజన్ రెండు రోజుల తర్వాత అంటే శుక్రవారం 31 మార్చి నుంచి ప్రారంభం కానుంది. టోర్నీకి అన్ని జట్లు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని జట్లు తమ కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగనుండగా.. కొన్ని జట్ల ఆటగాళ్లు టోర్నీకి ముందు అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తున్నారు. వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ లిట్టన్ దాస్ అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కూడా శుభవార్త అందింది.

బంగ్లాదేశ్ స్టార్ బ్యాట్స్‌మెన్ లిటన్ దాస్ గత కొన్ని నెలలుగా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐర్లాండ్‌పై లిటన్ తుఫాను బ్యాటింగ్‌తో ఓ రికార్డ్ నెలకొల్పాడు. మార్చి 29, బుధవారం నాడు చటోగ్రామ్‌లో ఉగ్రరూపం చూపించాడు.

ఐపీఎల్‌కు ముందు జరుగుతున్న టీ20 సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో, లిట్టన్ కేవలం 18 బంతుల్లో అర్ధ సెంచరీని కొట్టాడు. ఇది బంగ్లాదేశ్‌కు ఈ ఫార్మాట్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీగా కొత్త రికార్డు నమోదైంది. లిట్టన్ తన ఇన్నింగ్స్‌లో 41 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

లిట్టన్ వేగంగా బ్యాటింగ్ చేస్తుంటాడు. తొలి టీ20లో ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ కేవలం 23 బంతుల్లో 47 పరుగులు చేశాడు. అంతకు ముందు వన్డే సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలు కూడా సాధించాడు. అదే సమయంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో లిట్టన్ 73 పరుగులు చేశాడు.

28 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌ను డిసెంబర్ 2022 IPL వేలంలో రూ. 50 లక్షల ప్రాథమిక ధరకు KKR కొనుగోలు చేసింది. లిట్టన్ దాస్ ఐపీఎల్‌లో ఆడటం ఇదే తొలిసారి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..