Babar Azam : చెత్త రికార్డుల్లో మాకంటే తోపు లేరంటున్న పాక్ సీనియర్ క్రికెటర్.. ఈ సారి ఏం చేశారంటే ?
వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం డకౌట్ అయి మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గత పదేళ్లలో వన్డేల్లో అత్యధిక సార్లు సున్నా పరుగులకే అవుటైన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో బాబర్ రెండో స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీకి గతంలో సలహా ఇచ్చిన బాబర్.. ఇప్పుడు సొంత ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు.

Babar Azam : వర్షం కారణంగా అంతరాయం కలిగిన రెండో వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం దారుణంగా విఫలమయ్యాడు. ఒక్క పరుగు కూడా చేయకుండా సున్నాకే అవుట్ అయ్యాడు. గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న బాబర్ ఆజం, ఈ మ్యాచ్‌లో అవుట్ కావడంతో ఒక చెత్త రికార్డును తన పేరు మీద నమోదు చేసుకున్నాడు. డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం వెస్టిండీస్‌కు 35 ఓవర్లలో 181 పరుగుల లక్ష్యం లభించగా, ఆ జట్టు 10 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో వర్షం కారణంగా మ్యాచ్ 37 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్థాన్ ఓపెనర్లు సయీం అయూబ్, అబ్దుల్లా షఫీక్ తొలి వికెట్‌కు 37 పరుగులు జోడించారు. అయూబ్ 23 పరుగులు చేసి జాయ్‌డెన్ సీల్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన బాబర్ ఆజం, సీల్స్ వేసిన అద్భుతమైన యార్కర్ బంతికి బౌల్డ్ అయ్యాడు. మూడు బంతులు ఎదుర్కొని సున్నా పరుగులకే వెనుదిరిగాడు. అతను సున్నా పరుగులకే వెనుదిరగడం పాకిస్తాన్ అభిమానులను నిరాశపరిచింది. డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం వెస్టిండీస్‌కు 35 ఓవర్లలో 181 పరుగుల లక్ష్యం లభించింది. దాన్ని ఈజీగా ఛేదించి మ్యాచ్‌ను గెలుచుకుంది.
బాబర్ ఆజం పేలవ ఫామ్ కారణంగా టీ20 జట్టు నుంచి పలుమార్లు తప్పించారు. ఇప్పుడు ఆసియా కప్ 2025లో అతని స్థానంపై కూడా సందిగ్ధత నెలకొంది. టీ20 మాత్రమే కాదు, ఏ ఫార్మాట్‌లోనూ అతను నిలకడగా రాణించలేకపోతున్నాడు. గత అక్టోబర్‌లో టెస్ట్ జట్టు నుంచి తప్పించిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు, 8 ఇన్నింగ్స్‌లలో 4 సార్లు డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయాడు. గతంలో ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీకి బాబర్ ఆజం సలహా ఇచ్చాడు. స్ట్రాంగ్ గా ఉండు అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు బాబర్ ఆజం కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. వెస్టిండీస్‌పై సున్నా పరుగులకు అవుట్ కావడంతో, గత 10 ఏళ్లలో వన్డేలలో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం తన కెరీర్‌లో వన్డే ఫార్మాట్‌లో ఐదుసార్లు డకౌట్ అయ్యారు. 2018 జనవరి 6న న్యూజిలాండ్‌పై, అదే సంవత్సరం నవంబర్ 7న మళ్లీ న్యూజిలాండ్‌పై సున్నా పరుగులకే అవుట్ అయ్యారు. ఆ తర్వాత 2021 జూలై 8న ఇంగ్లండ్‌పై, 2023 ఆగస్టు 22న ఆఫ్ఘనిస్తాన్‌పై డకౌట్ అయ్యారు. తాజాగా, 2025 ఆగస్టు 10న వెస్టిండీస్‌పై సున్నాకే పెవిలియన్ చేరారు.
బాబర్ ఆజం బ్యాటింగ్ ప్రదర్శన గత కొన్ని రోజులుగా ఆందోళన కలిగిస్తోంది. 2023లో నేపాల్‌తో జరిగిన ఆసియా కప్‌లో చివరి అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత 63 మ్యాచ్‌లలో 71 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసినా సెంచరీ చేయలేకపోయాడు. అతని అత్యధిక స్కోరు 81గా ఉంది. వరల్డ్ కప్ 2023 తర్వాత ఆడిన 25 వన్డే మ్యాచ్‌లలో 39.68 సగటుతో 873 పరుగులు మాత్రమే చేశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




