Babar Azam vs Virat Kohli: కోహ్లీ నాకు బ్రదర్ లెక్క.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాబర్ అజాం
Babar Azam Comments on Virat Kohli: సెప్టెంబర్ 2న ఆసియా కప్-2023లో భారత్, పాకిస్థాన్ జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విరాట్, బాబర్ ఇద్దరూ చర్చకు కేంద్రంగా నిలిచారు. ఇద్దరూ తమ జట్ల ప్రధాన బ్యాట్స్‌మెన్‌లు కావడంతో వీరి చుట్టూ ఇరు జట్ల బ్యాటింగ్ తిరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

భారత జట్టు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌లను పోల్చుతుంటుంటారు. అయితే, ఈ పోలిక తరచుగా పాకిస్తాన్ వైపు నుంచి వినిపిస్తుంది. పాకిస్తాన్‌లోని చాలా మంది ప్రస్తుత, మాజీ ఆటగాళ్ళు బాబర్‌ను విరాట్‌తో పోల్చారు. అభిమానులు కూడా వీరిద్దరిని పోలుస్తూనే ఉంటుంటారు. విరాట్‌తో పోల్చడంపై బాబర్ ఇప్పుడు పెద్ద విషయం చెప్పుకొచ్చాడు. ఎవరు బెటర్ అనే చర్చకు రాకూడదని అన్నాడు. ఈ డిబేట్‌ని అభిమానులకే వదిలేద్దామని అన్నారు. విరాట్‌ను అన్న అంటూ కూడా పిలిచి, షాక్ ఇచ్చాడు.
సెప్టెంబర్ 2న ఆసియా కప్-2023లో భారత్, పాకిస్థాన్ జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విరాట్, బాబర్ ఇద్దరూ చర్చకు కేంద్రంగా నిలిచారు. ఇద్దరూ తమ జట్ల ప్రధాన బ్యాట్స్‌మెన్‌లు, వీరి చుట్టూ ఇరు జట్ల బ్యాటింగ్ తిరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో బాబర్ విలేకరుల సమావేశానికి వచ్చాడు. ఆ సమయంలో విరాట్‌కు సంబంధించిన ప్రశ్నలను కూడా ఎదుర్కోవలసి వచ్చింది.




విరాట్ అన్న లాంటివాడు..
Good Luck ,King lead us to victory🔥💯.#BabarAzam #PAKvIND #INDvPAK #INDvsPAK pic.twitter.com/9gw7RVBo2T
— Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) September 2, 2023
విరాట్‌తో తన పోలిక గురించి బాబర్ మాట్లాడుతూ, ఈ చర్చను అభిమానులకు వదిలివేయండి. దానిపై తాను వ్యాఖ్యానించదలుచుకోలేదు. ప్రతి ఒక్కరికి ఒక్కో కోణం ఉంటుందని, ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటామని అన్నాడు. విరాట్ తన కంటే పెద్దవాడని, ఏ దేశానికి చెందిన వారైనా పెద్దలను గౌరవించాలని తనకు బోధించారని బాబర్ చెప్పుకొచ్చాడు.
విరాట్ నుంచి చాలా నేర్చుకున్నా..
Rail stopped the Match at Pallekele.#PAKvIND #INDvPAK #pakvsind #INDvsPAK pic.twitter.com/qQ7PAID9Mb
— Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) September 2, 2023
విరాట్ నుంచి తాను చాలా నేర్చుకున్నానని బాబర్ తెలిపాడు. విరాట్‌కి సంబంధించిన చాలా ఇంటర్వ్యూలు చూస్తానని బాబర్ ప్రకటించాడు. 2019లో తాను విరాట్‌తో మాట్లాడానని, భారత ఆటగాడు కూడా అతనికి సహకరించాడని బాబర్ చెప్పుకొచ్చాడు. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పేందుకు బాబర్ నిరాకరించాడు. 2019 ప్రపంచకప్ తర్వాత ఈ రెండు జట్లు తొలిసారి వన్డేలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి.
టీమిండియా ప్లేయింగ్ 11
🚨 Toss & Team Update 🚨
Captain @ImRo45 has won the toss & #TeamIndia have elected to bat against Pakistan. #INDvPAK
A look at our Playing XI 🔽
Follow the match ▶️ https://t.co/hPVV0wT83S#AsiaCup2023 pic.twitter.com/onUyEVBwvA
— BCCI (@BCCI) September 2, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




