World Cup 2023: ప్రపంచకప్ చరిత్రలోనే ఆస్ట్రేలియా భారీ రికార్డ్.. స్పెషల్ జాబితాలో టీమిండియా కూడా..

Australia Biggest Victory: 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా 309 పరుగుల తేడాతో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియా తన పాత రికార్డును తానే బ్రేక్ చేసింది. అంతకుముందు ప్రపంచకప్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయం సాధించిన రికార్డు ఆస్ట్రేలియాదే కావడం గమనార్హం. మార్చి 2015లో జరిగిన ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది.

World Cup 2023: ప్రపంచకప్ చరిత్రలోనే ఆస్ట్రేలియా భారీ రికార్డ్.. స్పెషల్ జాబితాలో టీమిండియా కూడా..
Australia Squad

Updated on: Oct 25, 2023 | 10:16 PM

ODI World Cup 2023: న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బుధవారం ఆస్ట్రేలియా చారిత్రాత్మక ఫీట్ సాధించింది. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బుధవారం జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 309 పరుగుల భారీ తేడాతో నెదర్లాండ్స్ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 309 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ప్రపంచకప్ చరిత్రలో ఏ జట్టైనా సాధించిన పరుగుల పరంగా అతిపెద్ద విజయంగా ఇది ప్రపంచ రికార్డుగా నిలిచింది.

ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా గొప్ప రికార్డ్..

48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా 309 పరుగుల తేడాతో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియా తన పాత రికార్డును తానే బ్రేక్ చేసింది. అంతకుముందు ప్రపంచకప్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయం సాధించిన రికార్డు ఆస్ట్రేలియాదే. మార్చి 2015లో జరిగిన ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది. ఈ జాబితాలో భారత్ పేరు మూడో స్థానంలో నిలిచింది. మార్చి 2007లో జరిగిన ప్రపంచకప్‌లో భారత్ 257 పరుగుల తేడాతో బెర్ముడాను ఓడించింది. దక్షిణాఫ్రికా 2015 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ను కూడా ఇదే విధమైన పరుగుల తేడాతో ఓడించింది.

ODI ప్రపంచకప్ చరిత్రలో అతిపెద్ద విజయం (పరుగుల పరంగా)

1. ఆస్ట్రేలియా vs నెదర్లాండ్స్ – ఆస్ట్రేలియా 309 పరుగుల తేడాతో గెలిచింది (2023 ప్రపంచ కప్)

ఇవి కూడా చదవండి

2. ఆస్ట్రేలియా vs ఆఫ్ఘనిస్తాన్ – ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో గెలిచింది (2015 ప్రపంచ కప్)

3. భారత్ vs బెర్ముడా – భారత్ 257 పరుగుల తేడాతో గెలిచింది (2007 ప్రపంచ కప్)

4. దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్ – దక్షిణాఫ్రికా 257 పరుగులతో గెలిచింది (2015 ప్రపంచ కప్)

5. ఆస్ట్రేలియా vs నమీబియా – ఆస్ట్రేలియా 256 పరుగులతో గెలిచింది (2003 ప్రపంచ కప్)

వన్డేల్లో రెండో అతిపెద్ద విజయం..

309 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించడం వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా రెండో అతిపెద్ద విజయం. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన రికార్డును భారత్ సొంతం చేసుకుంది. 2023 జనవరిలో తిరువనంతపురంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ 317 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను ఓడించింది.

అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయం (పరుగుల పరంగా)

1. భారత్ vs శ్రీలంక – భారత్ 317 పరుగుల తేడాతో గెలిచింది (2023)

2. ఆస్ట్రేలియా vs నెదర్లాండ్స్ – ఆస్ట్రేలియా 309 పరుగుల తేడాతో గెలిచింది (2023)

3. జింబాబ్వే vs UAE – జింబాబ్వే 304 పరుగుల తేడాతో గెలిచింది (2023)

4. న్యూజిలాండ్ vs ఐర్లాండ్ – న్యూజిలాండ్ 290 పరుగుల తేడాతో గెలిచింది (2008)

5. ఆస్ట్రేలియా vs ఆఫ్ఘనిస్తాన్ – ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో గెలిచింది (2015)

మరిన్నిక్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..