Watch Video: సచిన్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన డేవిడ్ వార్నర్.. హర్దిక్ ఓవర్లో ఊచకోత.. ఆ లిస్టులో అగ్రస్థానం..

హార్దిక్ పాండ్యా వేసిన 7వ ఓవర్లో డేవిడ్ వార్నర్ కీలక మైలురాయిని చేరుకున్నాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ లిస్టులో అగ్రస్థానికి చేరుకున్నాడు. ఇంతకుముందు సచిన్, ఏబీడీ తలో 20 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు.

Watch Video: సచిన్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన డేవిడ్ వార్నర్.. హర్దిక్ ఓవర్లో ఊచకోత.. ఆ లిస్టులో అగ్రస్థానం..
మిచెల్, శ్రేయాస్ అయ్యర్, డేవిడ్ వార్నర్, డుసెన్, మార్ష్, మాక్సెవల్ ఖాతాలో 2 సెంచరీలు ఉన్నాయి.

Updated on: Oct 08, 2023 | 3:58 PM

India vs Australia, 5th Match: ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టు 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ క్రీజులో ఉన్నారు.

హార్దిక్ పాండ్యా వేసిన 7వ ఓవర్లో డేవిడ్ వార్నర్ కీలక మైలురాయిని చేరుకున్నాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ లిస్టులో అగ్రస్థానికి చేరుకున్నాడు. ఇంతకుముందు సచిన్, ఏబీడీ తలో 20 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు. ప్రపంచకప్‌లో 1000+ పరుగులు చేసిన నాల్గవ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

ఇక మ్యచ్ గురించి మాట్లాడితే.. మూడో ఓవర్ రెండో బంతికి మిచెల్ మార్ష్ ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. బుమ్రా వేసిన బంతికి స్లిప్స్‌లో కోహ్లీ క్యాచ్ అందుకున్నాడు.

వన్డే ప్రపంచకప్‌లో వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన ప్లేయర్లు వీరే..

ఆటగాడు సంవత్సరం ఇన్నింగ్స్‌లు
డేవిడ్ వార్నర్ (AUS) 2023 19
సచిన్ టెండూల్కర్ (IND) 1992-2011 (6) 20
AB డివిలియర్స్ (SA) 2007-2015 (3) 20
వివ్ రిచర్డ్స్ (WI) 1975-1987 (4) 21
సౌరవ్ గంగూలీ (IND) 1999-2007 (3) 21
మార్క్ వా (AUS) 1992-1999 (3) 22

రోహిత్ ముందు లక్కీ ఛాన్స్..

అయితే, ప్రపంచకప్‌లో వేగంగా 1000 పరుగుల రికార్డును అందుకోవడంపై రోహిత్ శర్మపై దృష్టి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆడిన రెండు ప్రపంచకప్‌లలో భారత కెప్టెన్ 17 ఇన్నింగ్స్‌ల్లో 978 పరుగులు చేశాడు. మరో 22 పరుగులు చేస్తే ఈ లిస్టులో అగ్రస్థానంలో నిలుస్తాడు.

ఇరుజట్లు:

ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..