IND vs AUS: ‘ఛీ, ఛీ.. ఇలాంటి డర్టీ సిగ్నల్స్ ఏంటి.. హెడ్‌కు చిప్ దొబ్బిందనుకుంటా.. కఠినంగా శిక్షించాల్సిందే’

Travis Head Celebrations After Dismissing Rishabh Pant: మెల్‌బోర్న్‌ టెస్టులో రిషబ్‌ పంత్‌ వికెట్‌ను ట్రావిస్‌ హెడ్‌ సెలబ్రేట్‌ చేసుకున్న తీరు వివాదాస్పందంగా మారింది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత నవజ్యోత్ సింగ్ సిద్ధూ తీవ్రంగా విమర్శలు గుప్పించాడు. హెడ్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

IND vs AUS: ఛీ, ఛీ.. ఇలాంటి డర్టీ సిగ్నల్స్ ఏంటి.. హెడ్‌కు చిప్ దొబ్బిందనుకుంటా.. కఠినంగా శిక్షించాల్సిందే
Navjot Singh Sidhu Criticizes Travis Head

Updated on: Dec 31, 2024 | 12:45 PM

Travis Head Celebrations After Dismissing Rishabh Pant: బోర్డర్ గవాస్కర్‌లో టీమిండియా 1-2తో వెనుకబడింది. ఈ సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌ మెల్‌బోర్న్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 184 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే, ఈ మ్యాచ్‌లో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ట్రావిస్ హెడ్ వికెట్ వేడుక కూడా ఉంది. మ్యాచ్ చివరి ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ వికెట్ పడగొట్టాడు. అయితే, ఆ తర్వాత, ట్రావిస్ హెడ్ సెలబ్రేట్ చేసుకున్న విధానం సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా మారింది. భారత అభిమానులతో పాటు, చాలా మంది మాజీ క్రికెటర్లు అతని వేడుకను డర్టీ సెలబ్రేషన్స్ అంటూ విమర్శిస్తున్నారు. మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

హెడ్ ​​వేడుకపై సిద్ధూ ఆగ్రహం..

వాస్తవానికి, భారత ఇన్నింగ్స్ 59వ ఓవర్లో ట్రావిస్ హెడ్ పంత్‌ను అవుట్ చేశాడు. భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో పంత్ మిచెల్ మార్ష్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత, ట్రావిస్ హెడ్ సైగలతో వికెట్‌ను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే, నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఈ వేడుక అస్సలు నచ్చలేదు. ట్రావిస్ హెడ్‌ను కఠినంగా శిక్షించాలని, ఇది అందరికీ ఓ అలర్ట్ అవుతుందని చెప్పుకొచ్చాడు.

నవజ్యోత్ సింగ్ సిద్ధూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “మెల్‌బోర్న్ టెస్ట్ సమయంలో ట్రావిస్ హెడ్ అసహ్యకరమైన ప్రవర్తన జెంటిల్‌మెన్ గేమ్‌కు ఏమాత్రం మంచిది కాదు. పిల్లలు, మహిళలు, యువకులు, వృద్ధులు మ్యాచ్‌ని చూస్తున్నారు. ఇదొక చెత్త ఉదాహరణ. ఈ ప్రవర్తన ఒక వ్యక్తిని కాదు, 1.5 బిలియన్ల భారతీయుల దేశాన్ని అవమానించినట్లు అవుతుంది. అతనికి కఠిన శిక్ష విధించాలి. అది భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. అలా చేయడానికి ఎవరూ సాహసించలేరు..’ అంటూ చెప్పుకొచ్చాడు.

అందరి దృష్టిని ఆకర్షించిన వివాదాలు..

ఈ మ్యాచ్‌లో తొలిరోజు విరాట్‌ కోహ్లీ, కంగారూ బ్యాట్స్‌మెన్‌ సామ్‌ కాన్‌స్టాంట్స్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ అంశం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఇది కాకుండా, చివరి రోజు ఆటలో యశస్వి జైస్వాల్‌ను ఔట్ చేసిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. వీడియోలో డిఫ్లెక్షన్‌ను చూసిన థర్డ్ అంపైర్ అతడిని ఔట్ చేశాడు. కానీ, స్నికోమీటర్‌లో ఎలాంటి కదలిక కనిపించకపోవడం గమనార్హం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..