AUS vs IND: టీమిండియాకు వరుణుడి టెన్షన్.. గబ్బా టెస్ట్ ‘డ్రా’ గా ముగిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ లెక్కలివే

|

Dec 14, 2024 | 5:29 PM

 భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతోన్న గాబా టెస్ట్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది.భారత్ WTC ఫైనల్స్‌ అవకాశాలు ఈ   మ్యాచ్ ఫలితంపైనే ఆధారపడి ఉంది. దీంతో ఈ మ్యాచ్ జరగాలని,  టీమిండియాకు అనుకూల ఫలితం రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.  

AUS vs IND: టీమిండియాకు వరుణుడి టెన్షన్.. గబ్బా టెస్ట్ డ్రా గా ముగిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ లెక్కలివే
Team India
Follow us on

బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా శనివారం (డిసెంబర్ 14) మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని ముందుగా కంగారూ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో తొలి రోజు ఆటను రద్దు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మిగిలిన నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచన ఇవ్వడంతో భారత జట్టు ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. ఎందుకంటే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే రోహిత్ సేన ఆస్ట్రేలియాతో మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలవాలి. అందువల్ల గబ్బా టెస్టులో గెలవడం టీమిండియాకు అనివార్యం. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న గబ్బా టెస్టు వర్షం కారణంగా డ్రా అయితే పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పు ఉండదు. అయితే ఇది డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే భారత్ అవకాశాలపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కంగారూ జట్టుపై వచ్చే రెండు టెస్టుల్లో తప్పక గెలవాల్సిన అవసరం ఆ జట్టుకు ఉంది. ఇది కాకుండా, ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాలి.

గబ్బా టెస్టు డ్రా అయితే ఆస్ట్రేలియా విజయాల శాతం 58.89 కాగా, భారత్ విజయాల శాతం 55.88గా ఉంటుంది. తద్వారా భారత్ 3వ స్థానంలోనూ, ఆస్ట్రేలియా 2వ స్థానంలోనూ కొనసాగుతాయి. దక్షిణాఫ్రికా యథావిధిగా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. GABA టెస్టులో ఫలితం వెలువడి, ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే, WTC పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానానికి ఎగబాకుతుంది. అంతేకాకుండా, ఓడిన ఆస్ట్రేలియా 56.67 విజయ శాతంతో మూడో స్థానానికి పడిపోతుంది. దీనికి విరుద్ధంగా, గబ్బాలో ఆస్ట్రేలియా గెలిస్తే, WTC పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. కానీ దాని గెలుపు శాతం దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి సమానం. అయితే, కంగారూలు భారత్‌ చేతిలో ఓడిపోతే మాత్రం WTC ఫైనల్స్‌కు అర్హత సాధించడానికి ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడవలసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మ్యాచ్ జరగాలి.. టీమిండియా గెలవాలి..

WTC ఫైనల్ లెక్కలివే..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..