IND vs AUS: వరుసగా 3 జీరోలు.. కట్‌చేస్తే.. సెంచరీతో మరోసారి భారత్‌కు తలనొప్పిలా మారిన హెడ్

Travis Head Century: గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ 727 రోజులుగా కొనసాగుతున్న వరుసకు బ్రేక్ వేశాడు. హెడ్ ​​తొలి పరుగు చేసిన వెంటనే, గబ్బా మైదానంలో భారీ నిరీక్షణకు ముగింపు పడింది. అంతకుముందు, ఈ మైదానంలో టెస్టుల్లో హెడ్ వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో 0 పరుగులకే అవుటయ్యాడు.

IND vs AUS: వరుసగా 3 జీరోలు.. కట్‌చేస్తే.. సెంచరీతో మరోసారి భారత్‌కు తలనొప్పిలా మారిన హెడ్
Nd Vs Aus Gabba Test Travis Head Century
Follow us
Venkata Chari

|

Updated on: Dec 15, 2024 | 10:56 AM

Travis Head Century: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజు వర్షం కారణంగా ఆటంకం ఏర్పడింది. తొలిరోజు భారీ వర్షం కారణంగా 13.2 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. అయితే రెండో రోజు వాతావరణం అనుకూలించడంతో ఆట మొదలైంది. వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాకు ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ అండగా నిలిచారు. ఎన్నో సందర్భాల్లో టీమిండియాకు తలనొప్పిలా మారిన ట్రావిస్ హెడ్.. ఈసారి కూడా చెలరేగిపోయాడు. తన అత్యుత్తమ ఫామ్‌తో ప్రతీ భారత బౌలర్‌ను చీల్చి చెండాడాడు. ఇంతకు ముందు గబ్బా మైదానంలో అతని రికార్డు చాలా సిగ్గుచేటుగా మారింది. కానీ, భారత్‌పై అతను గబ్బా మైదానంలో తన మునుపటి పేలవమైన రికార్డుకు చెక్ పెట్టేశాడు.

హెడ్ ​​గబ్బాలో వరుసగా మూడుసార్లు జీరోకే ఔట్..

ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులో హెడ్ అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్. అతను ఆస్ట్రేలియాకు ప్రతి ఫార్మాట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అతను T-20, ODIలలో తుఫాన్ బ్యాటింగ్ చేయడమే కాకుండా, టెస్ట్‌ల్లోనూ దూకుడు బ్యాటింగ్‌కు పేరుగాంచాడు. కానీ, గబ్బాలో అతని చివరి మూడు టెస్ట్ ఇన్నింగ్స్‌లు మరచిపోలేనివి. నిజానికి, అతను గబ్బాలో చివరి మూడు టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లోనూ 0 పరుగులకే అవుటయ్యాడు. 2024లో వెస్టిండీస్‌తో జరిగిన రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సున్నాకే ఔటయ్యాడు. అయితే, ఇంతకు ముందు 2022లో కూడా ఇదే మైదానంలో శ్రీలంకపై హెడ్ తన ఖాతా తెరవలేకపోయాడు.

టీమ్ ఇండియాపై సెంచరీతో తుఫాన్ ఇన్నింగ్స్..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ ఈ క్రమాన్ని బ్రేక్ చేశాడు. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న గబ్బా టెస్టులో మార్నస్ లాబుస్‌చాగ్నే వికెట్ పడినప్పుడు, ట్రావిస్ హెడ్ బ్యాటింగ్‌కు వచ్చాడు. భారత్‌పై తొలి పరుగు చేసిన వెంటనే ఈ క్రమాన్ని బ్రేక్ చేశాడు. గబ్బాలో హెడ్ వరుసగా మూడుసార్లు ‘గోల్డెన్ డక్’కి గురైనప్పటికీ, ఈ మైదానంలో అతను టెస్టుల్లో అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. ఇదే క్రమంతో ఈ సిరీస్‌లో రెండో సెంచరీతో చెలరేగాడు. ప్రస్తుతం హెడ్ 118 బంతుల్లో 103 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా టీ విరామానికి 3 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. స్మిత్ 65 పరుగులతో నిలిచాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..