AUS vs AFG: 68 బంతుల్లో 12 పరుగులు.. మ్యాక్సీ డబుల్ సెంచరీకి ఏమాత్రం తీసిపోని కమిన్స్ ఇన్నింగ్స్.. ఎందుకో తెలుసా?
Australia vs Afghanistan, Pat Cummins: ఆఫ్ఘనిస్తాన్‌పై ప్యాట్ కమిన్స్ 68 బంతుల్లో 12 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. 91 పరుగుల వద్ద ఏడు వికెట్లు పడిపోయిన తర్వాత పాట్ కమిన్స్ బ్యాటింగ్‌కు వచ్చాడు. మాక్స్‌వెల్‌తో కలిసి మ్యాచ్‌ని మలుతు తిప్పాడు. ఈ ఆత్మవిశ్వాసం అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. కమిన్స్ తన ఇన్నింగ్స్‌లో ఒక్కసారి కూడా అసౌకర్యంగా కనిపించలేదు. మ్యాక్స్‌వెల్ చరిత్ర సృష్టిస్తాడని నమ్మాడు. అందుకు తన వంతు సహకారం అందించాడు.

Australia vs Afghanistan, Pat Cummins: ముంబైలోని వాంఖడేలో గ్లెన్ మాక్స్వెల్ డబుల్ సెంచరీతో ఆఫ్ఘాన్ కలను ఛిద్రం చేశాడు. ఓడిపోయే దిశగా సాగిన ఆస్ట్రేలియా జట్టును, ఒంటి చేత్తో గెలిపించాడు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మ్యాక్స్‌వెల్ చరిత్ర సృష్టించాడు. అందరూ మాక్స్‌వెల్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ ఆస్ట్రేలియా విజయంలో పాట్ కమిన్స్ సహకారం కూడా ముఖ్యమైనది. 68 బంతుల్లో 12 పరుగులతో కమిన్స్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా గెలుపునకు ఎంతగానో ఉపయోగపడింది.
రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్పిన్‌ను ఎదుర్కొనేందుకు కీలక బ్యాట్స్‌మెన్‌లు ఇబ్బంది పడ్డారు. స్పిన్నర్లే కాకుండా, ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు కూడా విధ్వంసం సృష్టించారు. అయితే, కమిన్స్ ఒక ఎండ్‌లో పాతుకపోయి మాక్స్‌వెల్ స్వేచ్ఛగా ఆడటానికి అనుమతించాడు.
91 పరుగుల వద్ద ఏడు వికెట్లు పడిపోయిన తర్వాత పాట్ కమిన్స్ బ్యాటింగ్‌కు వచ్చాడు. మాక్స్‌వెల్‌తో కలిసి మ్యాచ్‌ని మలుతు తిప్పాడు. ఈ ఆత్మవిశ్వాసం అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. కమిన్స్ తన ఇన్నింగ్స్‌లో ఒక్కసారి కూడా అసౌకర్యంగా కనిపించలేదు. మ్యాక్స్‌వెల్ చరిత్ర సృష్టిస్తాడని నమ్మాడు. అందుకు తన వంతు సహకారం అందించాడు.
కమిన్స్ 12 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, అతను 68 బంతులు ఆడటం ఆస్ట్రేలియా విజయానికి నాంది పలికింది. కమిన్స్ తొందరగానే ఔట్ అయ్యి ఉంటే.. మ్యాక్స్‌వెల్ ఇలాంటి చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.
మాక్స్‌వెల్, కమిన్స్ ఎనిమిదో వికెట్‌కు 202 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ భాగస్వామ్యంలో మ్యాక్స్‌వెల్ ఎక్కువ పరుగులు చేసినా.. ఒక ఎండ్‌లో కమిన్స్ నిలదొక్కుకున్నప్పుడే అది సాధ్యమైంది.
తొలుత ఆడిన ఆఫ్ఘనిస్థాన్ 291 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా 91 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్, కమిన్స్‌లు 202* పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి అఫ్ఘానిస్థాన్‌కు విజయాన్ని దూరం చేశారు. ఈ భారీ ఇన్నింగ్స్‌లో, మ్యాక్స్‌వెల్ తన వ్యక్తిగత స్కోరు 33 పరుగుల వద్ద లైఫ్ అందుకున్నాడు. దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు ఇదే అతిపెద్ద పరుగుల వేటగా నిలిచింది.
ఇరుజట్లు:
View this post on Instagram
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్) , ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మార్నస్ లాబుస్‌చాగ్నే, మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్.
ఆఫ్ఘనిస్తాన్: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్) , రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్ (వికెట్), రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
