CWC 2023 Semi Finals: సెమీస్‌లో సౌతాఫ్రికాతో ఢీ కొట్టనున్న ఆసీస్.. టీమిండియాతో తలపడే జట్టు ఏదంటే?
ICC World Cup 2023 Semi Final Scenario: ప్రస్తుతం 16 పాయింట్లతో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. అలాగే సౌతాఫ్రికా 12 పాయింట్లు, ఆస్ట్రేలియా 12 పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే, నెట్ రన్ రేట్ విషయంతో సౌతాఫ్రికా ముందుండడంతో.. రెండో స్థానంలో నిలిచింది. ఇక నాలుగో స్థానం కోసం రేసులో నిలిచిన ఆఫ్గానిస్తాన్ ఆస్ట్రేలియాపై ఓడిపోవడంతో ఈ రేసు నుంచి తప్పుకుంది. ఇక ప్రధాన పోటీలో పాకిస్తాన్, న్యూజిలాండ్ టీంలు నిలిచాయి.

ICC World Cup 2023 Semi Final Scenario: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 చివరి దశకు వచ్చింది. ఇప్పటికే 39 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. దీంతో కొన్ని ఇప్పటికే మూడు జట్లు తమ సెమీస్ స్థానాన్ని నిర్థారించుకున్నాయి. మరో రెండు జట్లు నాలుగో స్థానం కోసం పోటీపడుతున్నాయి. అలాగే అఫీషియల్‌గా మూడు జట్లు సెమీస్ రేసు నుంచి తప్పుకున్నాయి. అయితే, గత మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్తాన్‌పై ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించడంతో సెమీస్‌లో పోటీ పడే జట్లు ఏమో తెలిపోయింది. ఆ నాలుగు జట్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం 16 పాయింట్లతో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. అలాగే సౌతాఫ్రికా 12 పాయింట్లు, ఆస్ట్రేలియా 12 పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే, నెట్ రన్ రేట్ విషయంతో సౌతాఫ్రికా ముందుండడంతో.. రెండో స్థానంలో నిలిచింది. ఇక నాలుగో స్థానం కోసం రేసులో నిలిచిన ఆఫ్గానిస్తాన్ ఆస్ట్రేలియాపై ఓడిపోవడంతో ఈ రేసు నుంచి తప్పుకుంది. ఇక ప్రధాన పోటీలో పాకిస్తాన్, న్యూజిలాండ్ టీంలు నిలిచాయి.
పాయింట్ల పట్టక ఎలా ఉందంటే?
| క్రమసంఖ్య | జట్టు | ఆడింది | గెలిచింది | ఓడిపోయింది | N/R | టైడ్ | నెట్ రన్ రేట్ | పాయింట్లు |
|---|---|---|---|---|---|---|---|---|
| 1 | భారతదేశం |
8 | 8 | 0 | 0 | 0 | +2.456 | 16 |
| 2 | దక్షిణ ఆఫ్రికా |
8 | 6 | 2 | 0 | 0 | +1.376 | 12 |
| 3 | ఆస్ట్రేలియా |
8 | 6 | 2 | 0 | 0 | +0.861 | 12 |
| 4 | న్యూజిలాండ్ |
8 | 4 | 4 | 0 | 0 | +0.398 | 8 |
| 5 | పాకిస్తాన్ |
8 | 4 | 4 | 0 | 0 | +0.036 | 8 |
| 6 | ఆఫ్ఘనిస్తాన్ |
8 | 4 | 4 | 0 | 0 | -0.338 | 8 |
| 7 | బంగ్లాదేశ్ |
8 | 2 | 6 | 0 | 0 | -1.142 | 4 |
| 8 | శ్రీలంక |
8 | 2 | 6 | 0 | 0 | -1.160 | 4 |
| 9 | నెదర్లాండ్స్ |
7 | 2 | 5 | 0 | 0 | -1.398 | 4 |
| 10 | ఇంగ్లండ్ |
7 | 1 | 6 | 0 | 0 | -1.504 | 2 |
స్క్వాడ్‌లు:
ఆస్ట్రేలియా జట్టు: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్(కీపర్), కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, సీన్ అబాట్ , అలెక్స్ కారీ.
పాకిస్థాన్ జట్టు: ఇమామ్-ఉల్-హక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(కీపర్), ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హరీస్ రవూఫ్, మహ్మద్ వసీం జూనియర్, షాహీన్ అఫ్రిది, సౌద్ షకీల్, అఘా సల్మాన్, ఉసామా మీర్, అబ్దుల్లా షఫీక్.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ , శుభమాన్ గిల్.
న్యూజిలాండ్ జట్టు: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్/కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌథీ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..










