Glenn Maxwell: 21 ఫోర్లు, 10 సిక్సులతో తుఫాన్ డబుల్ సెంచరీ.. కట్‌చేస్తే.. కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టిన మ్యాక్సీ..
Glenn Maxwell, ICC World Cup 2023: మ్యాక్స్‌వెల్ 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ చారిత్రాత్మక డబుల్ సెంచరీతో భారత దిగ్గజం కపిల్ దేవ్ రికార్డును కూడా మాక్స్‌వెల్ బద్దలు కొట్టాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా కపిల్‌ను తలపించేలా చేసిన మాక్స్‌వెల్, కపిల్ లాగా 6వ నంబర్‌లో బ్యాటింగ్ చేసి అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించాడు. 6వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో డబుల్ సెంచరీతో సునామీ సృష్టించిన ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ (Glenn Maxwell).. సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. ఆఫ్ఘనిస్థాన్ (Australia vs Afghanistan)తో జరిగిన మ్యాచ్ లో ఒంటిచేత్తో ఆస్ట్రేలియా జట్టును విజయ తీరానికి చేర్చాడు. అఫ్గానిస్థాన్ నిర్దేశించిన 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా కేవలం 49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. కానీ, ఆ తర్వాత బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసిన మ్యాక్స్‌వెల్ డబుల్ సెంచరీతో ఆస్ట్రేలియాకు మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. ఈ తుఫాన్ డబుల్ సెంచరీలో అతను ప్యాట్ కమ్మిన్స్ (Pat Cummins) తో కలిసి 202 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. అందులో 179 పరుగులు మాక్స్‌వెల్ బ్యాట్ నుంచి వచ్చాయి. మ్యాక్స్‌వెల్ 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు వన్డే ప్రపంచ కప్ 2023లో సెమీస్ చేరింది. ఈ చారిత్రాత్మక డబుల్ సెంచరీతో భారత దిగ్గజం కపిల్ దేవ్ (Kapil Dev) రికార్డును కూడా మాక్స్‌వెల్ బద్దలు కొట్టాడు.
బద్దలైన కపిల్ దేవ్ రికార్డ్..
ఈ మ్యాచ్‌లో 6వ ర్యాంక్‌లో బ్యాటింగ్ చేసిన గ్లెన్ మాక్స్‌వెల్ నంబర్ 1 ర్యాంక్‌లో నిలిచాడు. అతను 5 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేసి డబుల్ సెంచరీ కొట్టిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. దీంతో వన్డే ప్రపంచకప్‌లో గతంలో కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డును మాక్స్‌వెల్ బద్దలు కొట్టాడు.
1983 ప్రపంచకప్‌లో కపిల్ మ్యాజిక్..
View this post on Instagram
1983 ప్రపంచకప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో, 6వ స్థానంలో బ్యాటింగ్ చేసిన కపిల్ దేవ్ 138 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 175 పరుగులు చేశాడు. కపిల్ చేసిన ఈ సెంచరీతో టీమ్ ఇండియా ఉత్కంఠ విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా కేవలం 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున కూరుకుపోయింది. కానీ, ఆ రోజు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కపిల్ దేవ్.. టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో 6వ స్థానంలో బ్యాటింగ్ చేసిన కపిల్ 175 పరుగులతో అత్యధిక స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు.
ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా కపిల్‌ను తలపించేలా చేసిన మాక్స్‌వెల్, కపిల్ లాగా 6వ నంబర్‌లో బ్యాటింగ్ చేసి అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించాడు. 6వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
మాక్స్‌వెల్ వేగవంతమైన సెంచరీ..
ఈ ప్రపంచకప్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ కూడా అతని బ్యాట్ నుంచి వచ్చింది. అతను కేవలం 40 బంతుల్లో పూర్తి చేశాడు. దీంతో ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బ్యాట్స్‌మెన్‌గా మాక్స్‌వెల్ నిలిచాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




