- Telugu News Sports News Cricket news Asia Cup 2025 will be played without Rohit Sharma and Virat Kohli after 21 years check full details in telugu
Asia Cup 2025: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. 21 ఏళ్లలో తొలిసారి.. ఆసియా కప్‌లో ఎన్నడూ ఇలాంటి చూడలే..
Rohit Sharma and Virat Kohli: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమవుతుంది. కానీ ఈసారి అభిమానులు ఆసియా కప్‌లో 2 పెద్ద ఆటగాళ్లను కోల్పోతారు. గత 21 సంవత్సరాలలో ఈ ఇద్దరు ఆటగాళ్లు లేకుండా ఈ టోర్నమెంట్ జరగడం ఇదే మొదటిసారి.
Updated on: Aug 07, 2025 | 10:57 AM

కాగా, ఈసారి అభిమానులు ఆసియా కప్‌లో ఇద్దరు కీలక ఆటగాళ్లను కోల్పోతున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు ఈ టోర్నమెంట్‌లో భాగం కావడం లేదని తెలిసిందే. ఈ ఇద్దరు ఆటగాళ్లు టీ20ఐ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యారు. దీని కారణంగా వారిని జట్టులోకి ఎంపిక చేయరు.

21 సంవత్సరాల తర్వాత, ఈ ఇద్దరు ఆటగాళ్లలో ఒక్కరు కూడా ఆసియా కప్‌లో మైదానంలో కనిపించకపోవడం ఇదే మొదటిసారి. ఈ ఇద్దరు స్టార్లు లేకుండా చివరిసారిగా ఆసియా కప్ 2004లో భారత జట్టు ఆడింది. ఆ సమయంలో వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయలేదు.

ఆ తరువాత, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలలో కనీసం ఓ ఆటగాడు ప్రతి ఎడిషన్‌లో ఆసియా కప్ ఆడాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గత రెండు దశాబ్దాలుగా భారత క్రికెట్‌కు రెండు అతిపెద్ద స్తంభాలుగా ఉన్నారు. వారిద్దరూ తమ బ్యాటింగ్‌తో ప్రపంచంలో సంచలనం సృష్టించడమే కాకుండా, ఆసియా కప్ వంటి పెద్ద టోర్నమెంట్లలో భారతదేశం విజయం సాధించడంలో కూడా కీలక పాత్ర పోషించారు. 2010లో, ఇద్దరు ఆటగాళ్ళు కలిసి జట్టుకు టైటిల్‌ను గెలుచుకున్నారు. 2016 ఆసియా కప్ గెలిచిన భారత జట్టులో రోహిత్, విరాట్ కూడా భాగమయ్యారు.

2018 ఆసియా కప్‌లో రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో టీమ్ ఇండియాను విజయపథంలో నడిపించాడు. 2023లో కూడా రోహిత్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా ఈ టోర్నమెంట్‌ను గెలుచుకుంది. అప్పుడు విరాట్ కోహ్లీ కూడా జట్టులో ఉన్నాడు. కానీ, ఈసారి భారత అభిమానులు ఈ ఇద్దరు ఆటగాళ్లను మిస్ అవుతారు.

2025 ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 29 వరకు కొనసాగుతుంది. ఆసియా కప్ కోసం భారత క్రికెట్ జట్టును ఈ నెలాఖరులో ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది. అభిమానులు గత 21 సంవత్సరాలుగా ఆసియా కప్‌లో చూడని దృశ్యాన్ని కూడా ఈసారి చూడబోతున్నారు. గత ఎడిషన్ ఛాంపియన్ అయిన టీమ్ ఇండియా ఈసారి డిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి వస్తోంది.




