AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025 IND vs PAK Highlights: రెండోసారి ఇచ్చిపడేసిన భారత్.. చిత్తుగా ఓడిన పాక్..

Asia cup 2025 India vs Pakistan Match Highlights in Telugu: ఆసియా కప్ 2025లో భారత జట్టు పాకిస్థాన్‌పై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం రాత్రి జరిగిన రెండో సూపర్-4 మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో పాకిస్థానీలను ఓడించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 4 వికెట్లకు ఛేదించింది.

Asia Cup 2025 IND vs PAK Highlights: రెండోసారి ఇచ్చిపడేసిన భారత్.. చిత్తుగా ఓడిన పాక్..
Ind Vs Pak Live Updates
Venkata Chari
|

Updated on: Sep 22, 2025 | 12:08 AM

Share

India vs Pakistan Highlights, Asia Cup 2025, Todays Match Latest Updates: ఆసియా కప్ 2025లో భారత జట్టు పాకిస్థాన్‌పై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం రాత్రి జరిగిన రెండో సూపర్-4 మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో పాకిస్థానీలను ఓడించింది.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 4 వికెట్లకు ఛేదించింది.

ఆసియా కప్ 2025లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మరోసారి తలపడనున్నాయి. ఈసారి సూపర్ ఫోర్ మ్యాచ్. టోర్నమెంట్‌లో ఇరు జట్ల మధ్య ఇది ​​రెండవ మ్యాచ్ అవుతుంది. గతంలో, ఈ రెండు జట్లు గ్రూప్ దశలో తొలిసారి తలపడ్డాయి. అక్కడ భారత జట్టు పాకిస్థాన్‌ను ఓడించింది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య సూపర్ ఫోర్ మ్యాచ్ కూడా దుబాయ్‌లో జరుగుతోంది.

ఇది భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న 15వ టీ20 మ్యాచ్. దీనికి ముందు జరిగిన 14 టీ20 మ్యాచ్‌లలో భారత్ పాకిస్తాన్‌పై 11-3 ఆధిక్యంలో ఉంది. టీ20 ఆసియా కప్‌లో ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌లలో రికార్డు 2-2తో సమంగా ఉంది. వన్డే ఫార్మాట్‌తో సహా, ఆసియా కప్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ 20 సార్లు తలపడ్డాయి, భారత్ 11 సార్లు, పాకిస్తాన్ 6 సార్లు గెలిచాయి. మూడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

భారత్, పాక్ జట్ల ప్లేయింగ్ 11:

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 22 Sep 2025 12:05 AM (IST)

    భారత్ ఘన విజయం

    ఆసియా కప్ 2025లో భారత జట్టు పాకిస్థాన్‌పై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం రాత్రి జరిగిన రెండో సూపర్-4 మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో పాకిస్థానీలను ఓడించింది.

    దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 4 వికెట్లకు ఛేదించింది.

  • 21 Sep 2025 11:49 PM (IST)

    16 ఓవర్లకు భారత్..

    భారత జట్టు 16 ఓవర్లలో 3 వికెట్లకు 145 పరుగులు చేసింది.

  • 21 Sep 2025 11:26 PM (IST)

    అభిషేక్ ఔట్..

    భారత జట్టు 12.2 ఓవర్లలో 3 వికెట్లకు 123 పరుగులు చేసింది. తిలక్ వర్మ క్రీజులో ఉన్నారు. అభిషేక్ 24 బంతుల్లో తన అర్ధ సెంచరీని చేరుకున్నాడు.

  • 21 Sep 2025 11:11 PM (IST)

    తొలి వికెట్ కోల్పొయిన భారత్

    తొలి వికెట్ కోల్పొయిన భారత్, గిల్ అవుట్, 47 పరుగుల దగ్గర గిల్ అవుట్

  • 21 Sep 2025 11:04 PM (IST)

    9 ఓవర్లకు స్కోరు 101

    9 ఓవర్లకు స్కోరు 101/0. అభిషేక్ శర్మ (56), గిల్ (44) పరుగులతో ఉన్నారు.

  • 21 Sep 2025 10:57 PM (IST)

    అభిషేక్ 50

    దంచికొడుతున్న ఓపెనర్లు.. అభిషేక్  50తో దూసుకుపోతున్నాడు.

  • 21 Sep 2025 10:51 PM (IST)

    ఓపెనర్ల దూకుడు

    సైమ్ అయూబ్ వేసిన ఆరో ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ రెండు, అభిషేక్ శర్మ ఒక ఫోర్ బాదారు.

  • 21 Sep 2025 10:42 PM (IST)

    భారత్ స్కోర్: 50-0

    దూకుడు చూపిస్తున్న ఓపెనర్లు.. ఇండియా స్కోర్ 50-0

  • 21 Sep 2025 10:37 PM (IST)

    ఇరగదీస్తున్న ఓపెనర్లు..

    మూడో ఓవర్‌లోనూ రెండు ఫోర్లు, సిక్స్ , క్యాచ్‌ ఔట్‌ నుంచి తప్పించుకున్న అభిషేక్‌

  • 21 Sep 2025 10:34 PM (IST)

    మూడు ఓవర్లకు భారత్‌ స్కోరు 31-0

    క్రీజులో అభిషేక్‌ శర్మ 10, శుభ్‌మన్‌ గిల్‌ 21, మూడు ఓవర్లకు భారత్‌ స్కోరు 31-0

  • 21 Sep 2025 10:27 PM (IST)

    రెండు ఓవర్లకు 19రన్స్..

    అదరగొట్టిన ఓపెనర్లు.. ఓపెనర్లుగా వచ్చిన అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ తదైనా బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. రెండు ఓవర్లకు 19 పరుగులు  చేశారు.

  • 21 Sep 2025 10:20 PM (IST)

    మొదటి బాలే సిక్స్..

    తొలి బంతికే సిక్స్ కొట్టాడు అభిషేక్ శర్మ .. అదిరిపోయే సిక్స్ ఇది

  • 21 Sep 2025 09:59 PM (IST)

    టీమిండియా టార్గెట్ 172

    20 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు ముందు 172 పరుగుల టార్గెట్ నిలిచింది.

  • 21 Sep 2025 09:44 PM (IST)

    18 ఓవర్లకు పాక్..

    18 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ 146/4తో ఉంది. మహ్మద్ నవాజ్, కెప్టెన్ సల్మాన్ అలీ అఘా క్రీజులో ఉన్నారు.

  • 21 Sep 2025 09:28 PM (IST)

    4వ వికెట్ డౌన్..

    14.1 ఓవర్లకు పాకిస్తాన్ 115/4తో ఉంది. మహ్మద్ నవాజ్, కెప్టెన్ సల్మాన్ అలీ అఘా క్రీజులో ఉన్నారు. సాహిబ్జాదా ఫర్హాన్ 58 పరుగుల వద్ద ఔటయ్యాడు.

  • 21 Sep 2025 09:20 PM (IST)

    3వ వికెట్ కోల్పోయిన పాక్..

    13.1 ఓవర్ల తర్వాత పాకిస్తాన్ 110/3తో ఉంది. సాహిబ్‌జాదా ఫర్హాన్ క్రీజులో ఉన్నాడు. ఫర్హాన్ 34 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తలక్ 10 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

  • 21 Sep 2025 09:15 PM (IST)

    బ్రేకిచ్చిన దూబే..

    11వ ఓవర్ వేసిన శివం దుబే భారత్ కు రెండో వికెట్ అందించ్చాడు. శివం దూబే బౌలింగ్ లో సాయిమ్ అయూబ్ షాట్ మిస్సవ్వడంతో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. బ్యాక్-ఆఫ్-లెంగ్త్ డెలివరీలో సాయిమ్ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ అదనపు బౌన్స్ టాప్ ఎడ్జ్ కు దారితీసింది. బంతి లాంగ్ లెగ్ లో నిలబడి ఉన్న అభిషేక్ శర్మ వైపు వెళ్ళింది. అభిషేక్ క్యాచ్ తీసుకోవడానికి డైవ్ చేశాడు. అభిషేక్ గతంలో రెండు క్యాచ్ లు వదిలాడు.

  • 21 Sep 2025 08:55 PM (IST)

    10 ఓవర్లకు పాక్..

    10 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ 91/1తో ఉంది. సాహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్ క్రీజులో ఉన్నారు. ఫర్హాన్ 34 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత ఫీల్డర్లు ఇప్పటివరకు మూడు క్యాచ్‌లు వదులుకున్నారు.

  • 21 Sep 2025 08:48 PM (IST)

    8 ఓవర్లకు పాక్ స్కోర్..

    8 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 70/1గా ఉంది. సాహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్ క్రీజులో ఉన్నారు.

  • 21 Sep 2025 08:39 PM (IST)

    ముగిసిన పవర్ ప్లే..

    పవర్ ప్లే ముగిసే సరికి పాక్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 55 పరుగులు చేసింది.

  • 21 Sep 2025 08:30 PM (IST)

    4 ఓవర్లకు..

    4 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ 36/1తో ఉంది. సాహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్ క్రీజులో ఉన్నారు.

  • 21 Sep 2025 08:19 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన పాక్..

    ఫఖార్ జమాన్ (15) రూపంలో పాక్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా భారత జట్టుకు తొలి వికెట్ అందించాడు. శాంసన్ అద్భుత క్యాచ్‌తో పాక్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది.

  • 21 Sep 2025 08:13 PM (IST)

    రెండు ఓవర్లకు స్కోర్

    రెండు ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 17/0గా నిలిచింది. సాహిబ్‌జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్ క్రీజులో ఉన్నారు.

  • 21 Sep 2025 08:08 PM (IST)

    క్యాచ్ మిస్ చేసిన అభిషేక్

    హార్దిక్ తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు. అయితే,  ఫర్హాన్ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను అభిషేక్ శర్మ మిస్ చేశాడు. దీంతో తొలి ఓవర్‌లో 6 పరుగులు పాక్ ఖాతాలో చేరాయి.

  • 21 Sep 2025 07:59 PM (IST)

    ఈ రికార్డుపై అభిషేక్ శర్మ దృష్టి

    టీం ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ ఆసియా కప్‌లో రికార్డు సృష్టించవచ్చు. అతను ఇప్పటికే T20I లలో 46 సిక్సర్లు కొట్టాడు. అతను మరో నాలుగు సిక్సర్లు కొడితే, అతి తక్కువ మ్యాచ్‌లలో 50 సిక్సర్లు కొట్టిన ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్‌మన్ అవుతాడు.

  • 21 Sep 2025 07:42 PM (IST)

    నో షేక్ హ్యాండ్స్..

    టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ మరోసారి పాక్ కెప్టెన్‌కు కరచాలనం చేయలేదు. ఇదే విషయంపై ఇప్పటి వరకు ఎన్నో చర్యలు పాకిస్తాన్ చేపట్టినా, ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మ్యాచ్ తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగునుందని తెలుస్తోంది.

  • 21 Sep 2025 07:37 PM (IST)

    భారత ప్లేయింగ్ 11లో 2 మార్పులు..

    ప్లేయింగ్ ఎలెవన్‌లో భారత్ రెండు మార్పులు చేసింది. జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చారు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లను జట్టులోకి తీసుకోలేదు.

  • 21 Sep 2025 07:35 PM (IST)

    భారత్ (ప్లేయింగ్ XI):

    అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

  • 21 Sep 2025 07:34 PM (IST)

    టాస్ గెలిచిన సూర్యకుమార్..

    సూపర్‌లో భాగంగా పాకిస్తాన్ జట్టుతో జరుగుతోన్న సూపర్ 4 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచాడు. దీంతో ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

  • 21 Sep 2025 07:25 PM (IST)

    IND vs PAK: వాతావరణం ఎలా ఉంది?

    దుబాయ్‌లో ప్రస్తుతం చాలా వేడిగా ఉంది. మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత 35 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని అంచనా. దుబాయ్‌లో రాత్రిపూట ఉష్ణోగ్రత తగ్గుతుంది. మైదానంలో మంచు కురుస్తుంది. దీని వలన స్కోరును కాపాడుకోవడం కష్టమవుతుంది.

  • 21 Sep 2025 07:10 PM (IST)

    IND vs PAK: పిచ్ రిపోర్ట్..

    దుబాయ్ క్రికెట్ స్టేడియంలోని పిచ్ ఇప్పటివరకు నెమ్మదిగా ఉంది. ఈ పిచ్‌పై స్పిన్నర్లు పెద్ద ముప్పుగా మారవచ్చు. ఈ టోర్నమెంట్‌లో, దుబాయ్‌లో జరిగిన ఆరు మ్యాచ్‌లలో రెండవసారి బ్యాటింగ్ చేసిన జట్టు నాలుగు గెలిచింది.

  • 21 Sep 2025 07:09 PM (IST)

    IND vs PAK: స్టేడియం చేరుకున్న భారత జట్టు

    పాకిస్థాన్‌తో జరిగే సూపర్-4 మ్యాచ్ కోసం భారత జట్టు దుబాయ్ స్టేడియం చేరుకుంది.

  • 21 Sep 2025 06:55 PM (IST)

    దుబాయ్ స్టేడియం గణాంకాలు..

    ఇప్పటివరకు, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన T20 మ్యాచ్‌లలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ నాలుగుసార్లు తలపడ్డాయి. రెండు జట్లు చెరో రెండు మ్యాచ్‌లను గెలుచుకున్నాయి. ఇక్కడ జరిగిన మొదటి భారతదేశం-పాకిస్తాన్ పోటీ 2021 టీ20 ప్రపంచ కప్‌లో జరిగింది. పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత, 2022 టీ20 ఆసియా కప్‌లో రెండు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. భారత జట్టు ఒక మ్యాచ్‌ను గెలుచుకోగా, పాకిస్తాన్ ఒక మ్యాచ్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత, ప్రస్తుత ఆసియా కప్ గ్రూప్ రౌండ్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కూడా జరిగింది. భారత జట్టు ఆ మ్యాచ్ ను 7 వికెట్ల తేడాతో గెలుచుకుంది. ఇక్కడ జరిగిన నాలుగు మ్యాచ్‌లలో, తరువాత బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది.

  • 21 Sep 2025 06:45 PM (IST)

    సెంచరీ చేయని భారత ఆటగాళ్లు..

    ఓపెనర్ అభిషేక్ శర్మ అత్యధికంగా 99 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ 3 మ్యాచ్‌ల్లో 35 పరుగులు మాత్రమే చేయగలిగాడు. సంజు సామ్సన్ స్థానంలో గిల్‌కు ఓపెనింగ్ ఇచ్చారు. సామ్సన్ ఒకే ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి 56 పరుగులు చేసి గిల్ కంటే ముందు నిలిచాడు.

  • 21 Sep 2025 06:30 PM (IST)

    India vs Pakistan: ఆ లోపాలు అధిగమించేనా?

    ఈ టోర్నమెంట్‌లో భారత్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. అయినప్పటికీ, జట్టులో కొన్ని సమస్యలు తలెత్తాయి. మూడు మ్యాచ్‌ల తర్వాత కూడా, టోర్నమెంట్‌లో ఏ భారత బ్యాట్స్‌మన్ కూడా 100 పరుగులు పూర్తి చేయలేకపోయాడు.

  • 21 Sep 2025 06:00 PM (IST)

    హ్యాండ్ షేక్ జరిగేనా?

    భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు. మరి ఈ మ్యాచ్‌లో కరచాలనం జరుగుతుందా లేదా అని అంతా వేచి చూస్తున్నారు.

  • 21 Sep 2025 05:28 PM (IST)

    మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్..

    భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తారు. చివరిసారిగా ఈ రెండు జట్లు తలపడినప్పుడు ఆయనే మ్యాచ్ రిఫరీగా వ్యవహరించారు. కరచాలన వివాదం తర్వాత , పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పైక్రాఫ్ట్ పై తీవ్రమైన ఆరోపణలు చేసి , టోర్నమెంట్ నుంచి అతన్ని తొలగించాలని డిమాండ్ చేసింది.

  • 21 Sep 2025 04:59 PM (IST)

    India vs Pakistan: పాకిస్తాన్ ఓపెనింగ్ జోడీ మారుతుందా?

    భారత్‌తో జరిగే మ్యాచ్ కోసం పాకిస్తాన్ జట్టులో కొన్ని ప్రధాన మార్పులు చూడవచ్చు. సామ్ అయూబ్ ఇప్పటివరకు పూర్తిగా విఫలమయ్యాడు. వరుసగా మూడు మ్యాచ్‌లలో 0 పరుగులకే ఔటయ్యాడు. అందువల్ల, అతన్ని టాప్ ఆర్డర్ నుంచి కిందకు పంపవచ్చు.

  • 21 Sep 2025 04:40 PM (IST)

    IND vs PAK: సూపర్-4లో టీమిండియా రికార్డు..

    టీ20 ఆసియా కప్ సూపర్ 4 దశలో టీం ఇండియా ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడింది. ఈ మూడు మ్యాచ్‌లు 2022 టీ20 ఆసియా కప్ సందర్భంగా జరిగాయి. ఈ మ్యాచ్‌లలో భారత్ ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచి రెండు ఓటములతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.

  • 21 Sep 2025 04:10 PM (IST)

    సైమ్ అయూబ్ పాకిస్తాన్ రికార్డును సమం చేస్తాడా?

    India vs Pakistan Live Score: పురుషుల T20I లలో అత్యధిక డకౌట్లు అయిన పాకిస్తాన్ బౌలర్ గా అబ్దుల్లా షఫీక్ రికార్డు సృష్టించాడు. వరుసగా నాలుగు ఇన్నింగ్స్ లలో డకౌట్ గా ఔటయ్యాడు. 2025 ఆసియా కప్ లో సామ్ అయూబ్ మూడుసార్లు ఇలా చేశాడు. భారత్ తో జరిగిన సూపర్ ఫోర్ లో కూడా అతను డకౌట్ అయితే, అతను పాకిస్తాన్ రికార్డును సమం చేస్తాడు.

  • 21 Sep 2025 03:59 PM (IST)

    సూపర్ 4 మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ జట్టు సందిగ్ధంలో..

    India vs Pakistan Live Score: భారత్‌తో జరిగే సూపర్ ఫోర్ మ్యాచ్ కోసం పాకిస్తాన్ తమ జట్టులో అనేక మార్పులు చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి హసన్ నవాజ్‌ను తొలగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అతని స్థానంలో హుస్సేన్ తలత్ రావొచ్చు. ఫఖర్ జమాన్, హారిస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించవచ్చు. సామ్ అయూబ్ మూడవ స్థానంలో ఆడవచ్చు.

  • 21 Sep 2025 03:50 PM (IST)

    India vs Pakistan: టాస్ ఎప్పుడు జరుగుతుంది?

    India vs Pakistan Live Score: భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే సూపర్ ఫోర్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ అరగంట ముందుగా, భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు జరుగుతుంది.

  • 21 Sep 2025 03:30 PM (IST)

    ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య 21వ మ్యాచ్

    Ind vs Pak Live Updates: ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు 21వ సారి తలపడనున్నాయి. గతంలో ఆడిన 20 మ్యాచ్‌ల్లో భారత్ 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పాకిస్తాన్ 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

  • 21 Sep 2025 03:15 PM (IST)

    Ind vs Pak Live Score: 15వ సారి పోటీకి సిద్ధం..

    Ind vs Pak Live Score: ఈసారి, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్లు T20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 15వ సారి తలపడనున్నాయి. గత 14 మ్యాచ్‌ల ఫలితాలు భారత్‌కు 11-3తో అనుకూలంగా ఉన్నాయి.

  • 21 Sep 2025 02:56 PM (IST)

    Ind vs Pak Live Score: దుబాయ్‌లో టాస్ కీలకం..

    సూపర్ ఫోర్ లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో టాస్ కీలకం కానుంది. దుబాయ్ లోనే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన గత నాలుగు T20I లు ఛేజింగ్ జట్టు విజయానికి దారితీశాయి. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి తొమ్మిది T20I లలో, ఛేజింగ్ జట్టు ఎనిమిదింటిలో గెలిచింది.

  • 21 Sep 2025 02:48 PM (IST)

    భారీ రికార్డులకు చేరువలో పాండ్యా, శాంసన్..

    India vs Pakistan Live Score: పాకిస్థాన్‌తో జరిగే సూపర్ 4 మ్యాచ్‌లో సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా ప్రధాన మైలురాళ్లను సాధించే ఛాన్స్ ఉంది. శాంసన్ ఇంకా 83 పరుగులు చేస్తే టీ20ల్లో భారతదేశం తరపున 1,000 పరుగులు చేసిన 12వ ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా టీ20లో 100 వికెట్లు తీయడానికి నాలుగు అడుగుల దూరంలో ఉన్నాడు.

  • 21 Sep 2025 02:39 PM (IST)

    పాకిస్థాన్ పై భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

    అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.

Published On - Sep 21,2025 2:37 PM