IND vs PAK: ఆసియా కప్ 2023 సూపర్-4 రౌండ్‌లో భాగంగా భారత్, పాక్ జట్లు మరోసారి తలపడబోతున్నాయి. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగే ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం పాకిస్తాన్ జట్టు ముందుగానే ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. రోహిత్ నేతృత్వంలోని భారత్‌తో తలపడేందుకు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ తన జట్టులో భారీ మార్పు చేశాడు. ఈ మ్యాచ్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్ మహ్మద్ నవాజ్ స్థానంలో మీడియం పేసర్ ఫహీమ్ అష్రాఫ్‌ను జట్టులోకి తీసుకున్నాడు.
భారత జట్టులో కూడా మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఆసియా కప్‌లో భారత్ ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన కేఎల్ రాహుల్ జట్టులోకి తిరిగి వచ్చాడు. అలాగే భారత్, నేపాల్ మధ్య జరిగిన టీమిండియా రెండో మ్యాచ్ ఆడకుండా ముంబై వెళ్లిన జస్ప్రీత్ బూమ్రా కూడా రేపటి మ్యాచ్‌కి అందుబాటులో ఉండనున్నాడు. ఈ క్రమంలో కేెఎల్ రాహుల్ కారణంగా ఇషాన్ కిషన్‌పై, జస్ప్రీమ్ బూమ్రా కారణంగా మహ్మద్ షమిపై వేటు పడుతుందేమోనన్న చర్చలు జరుగుతున్నాయి.
Our playing XI for the #PAKvIND match 🇵🇰#AsiaCup2023 pic.twitter.com/K25PXbLnYe
— Pakistan Cricket (@TheRealPCB) September 9, 2023
ఇదిలా ఉండగా.. రేపటి మ్యాచ్ జరిగే ప్రేమదాస స్టేడియంలో విరాట్ కోహ్లీ గొప్ప రికార్డులను కలిగి ఉన్నాడు. ఈ మైదానంలో 8 వన్డేలు ఆడిన కోహ్లీ 103.8 సగటుతో మొత్తం 519 పరుగులు చేశాడు. ముఖ్యంగా తన చివరి మూడు వన్డేల్లో 128* (119), 131(96), 110* (116) రూపంలో మూడు వరుస సెంచరీలు బాదాడు. పైగా రేపటి మ్యాచ్ భారత్‌కి టోర్నీలో అవకాశం కంటే స్వభిమానం కోసం చాలా ముఖ్యం. ఈ క్రమంలో రేపు కూడా కోహ్లీ చెలరేగే సూచన కనిపిస్తోంది.
Dil mange more
Who want to see this thriller again on 10th September India vs Pakistan#IndiaVsPakistan #INDvsPAK #AsiaCup23 #AsiaCup2023 #WorldCup2023 #ViratKohli pic.twitter.com/V97GuX38WL— cricketbuzz (@Mohdyasir6911) September 9, 2023
అలాగే రేపటి భారత్-పాక్ మ్యాచ్‌కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) రిజర్వ్ డేని ప్రకటించింది. కాబట్టి ఈ సూపర్-4 స్థాయి మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించినా.. ఫలితం తేలనుంది.
పాకిస్థాన్ ప్లేయింగ్ 11: బాబర్ ఆజామ్ (కెప్టెన్), ఇమామ్ ఉల్ హక్, ఫఖర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా మరియు హరీస్ రవూఫ్.
భారత ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బూమ్రా.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..