Asia Cup 2023: ‘పాకిస్తాన్‌కు రాకపోతే టీమిండియా నరకానికి పోతుంది’: బీసీసీఐపై మాజీ ప్లేయర్ ఘాటు వ్యాఖ్యలు..

|

Feb 06, 2023 | 5:21 PM

IND vs PAK: ఆసియా కప్ 2023 ఆతిథ్యం గురించి గత మూడు నెలలుగా రచ్చ జరగుతోంది. పాకిస్తాన్ ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వాలని బలంగా కోరుకుంటుంది. అయితే బీసీసీఐ మాత్రం పాక్ వెళ్లేందుకు సిద్ధంగా లేదు.

Asia Cup 2023: పాకిస్తాన్‌కు రాకపోతే టీమిండియా నరకానికి పోతుంది: బీసీసీఐపై మాజీ ప్లేయర్ ఘాటు వ్యాఖ్యలు..
Odi Asia Cup 2023
Follow us on

Javed Miandad Comments on Indian Team: ఆసియా కప్ 2023 ఆతిథ్యానికి సంబంధించి భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలు మరింత దెబ్బతినేటట్లు కనిపిస్తున్నాయి. ఇటీవల బహ్రెయిన్‌లో జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో కూడా దీనిపై ఘాటుగా చర్చలు జరిగాయి. 2023 ఆసియా కప్‌నకు ఆతిథ్యం ఇవ్వాలని పాకిస్థాన్ బలంగా కోరుకుంటుంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టును పాకిస్థాన్‌కు పంపడం సాధ్యం కాదని బీసీసీఐ చెబుతోంది. బీసీసీఐ ఈ వైఖరిపై తాజాగా పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ జావేద్ మియాందాద్ ప్రకటన కలకలం రేపింది.

ఓ ఈవెంట్‌లో మియాందాద్‌ను భారత జట్టు పాకిస్థాన్‌కు రాకపోవడంపై ప్రశ్నలు అడిగారు. మియాందాద్ మాట్లాడుతూ, ‘వారు (భారత జట్టు) రాకపోతే నరకానికి వెళ్తారు. మేం పట్టించుకోం. నేను ఇంతకుముందు కూడా ఇదే చెప్పాను. మేం మా క్రికెట్‌ను పొందుతున్నాం. ఇది ఐసీసీ పని. ఈ విషయాన్ని ఐసీసీ నియంత్రించలేకపోతే, అటువంటి పాలకమండలి ఉండి ఉపయోగం లేదు’ అంటూ ఘాటుగా స్పందించాడు.

మియాదంద్ మాట్లాడుతూ, ‘ఐసీసీ అన్ని దేశాలకు ఒకే విధమైన నియమాలను కలిగి ఉండాలి. ఒక టోర్నమెంట్‌లో బలమైన జట్టు రాకపోతే, దానిని నిలిపేయాలి. భారత జట్టు భారతదేశం కోసం ఉంటుంది. అది మాకు లేదా ప్రపంచానికి మాత్రం కాదు’ అంటూ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

‘ఇక్కడ ఓడిపోతే పరువు పోతుంది’

ఈ క్రమంలో భారత జట్టు పాకిస్థాన్‌కు రాకపోవడానికి మియాందాద్ మరో కారణాన్ని కూడా చెప్పుకొచ్చాడు. భారత జట్టు పాకిస్తాన్‌లో ఎందుకు ఆడదంటే.. ఇక్కడ ఓడిపోతే ఇబ్బంది పడతారు. భారత ప్రజానీకం ఊరుకోదు. ఇది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంది. టీమిండియా ఓడిపోయినప్పుడల్లా ఆ దేశంలో సమస్యగా మారుతుంది. అదే కారణంతో భారత జట్టు మా కాలంలో కూడా ఇక్కడికి రాలేదు. భారతదేశం ఓడిపోయినప్పుడల్లా, భారత్‌లోని జనం ఇళ్లకు నిప్పు పెడుతుంటారు. మేం ఆడేటప్పుడు, భారత ఆటగాళ్ళతో చాలా సమస్యలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..