Asia Cup: ఈ ఏడాదైనా ఆసియా కప్ జరిగేనా? విపత్తులా మారిన శ్రీలంక పరిస్థితులు..
ఇందులో శ్రీలంక క్రికెట్‌కు తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల తర్వాత, ప్రతిపాదిత ఆసియా కప్ 2022 ఈ సంవత్సరం శ్రీలంకలో నిర్వహిస్తారా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గత కొన్ని రోజులుగా శ్రీలంక(Sri Lanka)లో పరిస్థితులు గందరగోళంగా మారాయి. దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఆహార పదార్థాల కొరత తీవ్రంగా ఏర్పడింది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. పెట్రోల్, డీజిల్‌ల తీవ్ర కొరత కొనసాగుతోంది. ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వంపై విపరీతమైన ఆగ్రహం కొనసాగుతోంది. అదే సమయంలో ప్రభుత్వం భద్రతా బలగాల అధికారాన్ని ఆందోళనకారులపై ప్రయోగిస్తోంది. దేశంలోని ఇతర అంశాలపై కూడా దాని ప్రభావం పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇందులో శ్రీలంక క్రికెట్‌కు తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల తర్వాత, ప్రతిపాదిత ఆసియా కప్ 2022(Asia Cup) ఈ సంవత్సరం శ్రీలంకలో నిర్వహిస్తరారా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ ఏడాది ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రీలంకలో 6 జట్లతో ఆసియా కప్ జరగనుంది. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా, ఈ టోర్నమెంట్‌ను 2020లో, తర్వాత 2021లో నిర్వహించడం సాధ్యం కాలేదు. ఈసారి టోర్నీని టీ20 ఫార్మాట్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈమేరకు గత నెలలో జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో తుది ఆమోదం లభించడంతో టోర్నీపై ఉత్కంఠ నెలకొంది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది.
ఆదివారం తుది తీర్పు..!
ప్రస్తుతం వేదిక మార్పుపై తుది నిర్ణయం తీసుకోలేదని, అయితే ఈ ప్రశ్న నిరంతరం ఉత్పన్నమవుతోందని, ఇటువంటి పరిస్థితిలో ఆదివారం జరిగే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ త్రైమాసిక సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. ఏప్రిల్ 10న తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, నివేదికల మేరకు శ్రీలంక నుంచి ఆసియా కప్ తరలివెళ్లనున్నట్లు తెలుస్తోంది. వేరే దేశంలో ఈ టోర్నీని నిర్వహించే అవకాశం ఉంది.
ఇతర సిరీస్‌లకు కూడా ముప్పు..
ఈసారి ఆసియా కప్ చాలా విధాలుగా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌నకు కేవలం ఒక నెల ముందు నిర్వహించనున్నారు. అది కూడా T20 ఫార్మాట్‌లో జరగనుంది. ఇటువంటి పరిస్థితిలో, ఇది ఆసియా జట్లకు సన్నాహక పరంగా మంచి అవకాశాన్ని అందిస్తుంది. ఆసియా కప్ మాత్రమే కాదు, శ్రీలంకలో ద్వైపాక్షిక సిరీస్‌లను నిర్వహించడంపై కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ సంవత్సరం జూన్, ఆగస్టు మధ్య, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ టెస్ట్, టీ20 సిరీస్‌ల కోసం శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ ఈవెంట్ కూడా వాయిదా పడే అవకాశం ఉంది.
Also Read: IPL 2022: బెంగళూర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. తర్వాతి మ్యాచ్‌లకు దూరమైన కీలక బౌలర్.. ఎందుకంటే?