AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashes Test Day 1: ఇది క్రికెట్ మ్యాచ్ కాదు మామ వికెట్ల పండుగ..బౌలర్ల దెబ్బకు బ్యాట్స్‌మెన్ బెంబేలు

సుదీర్ఘకాలంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే యాషెస్ సిరీస్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ పెర్త్ లో ప్రారంభమైంది. మొదటి రోజు ఆటలోనే ఈ మ్యాచ్ అభిమానులను థ్రిల్‌కు గురిచేసింది. ఒకే రోజు ఏకంగా 19 వికెట్లు నేలకూలాయి. ఈ రోజు ఆట మొత్తం ఫాస్ట్ బౌలర్ల ఆధిపత్యం నడిచింది.

Ashes Test Day 1: ఇది  క్రికెట్ మ్యాచ్ కాదు మామ వికెట్ల పండుగ..బౌలర్ల దెబ్బకు బ్యాట్స్‌మెన్ బెంబేలు
Ashes 2025 First Test
Rakesh
|

Updated on: Nov 21, 2025 | 5:19 PM

Share

Ashes Test Day 1: సుదీర్ఘకాలంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే యాషెస్ సిరీస్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ పెర్త్ లో ప్రారంభమైంది. మొదటి రోజు ఆటలోనే ఈ మ్యాచ్ అభిమానులను థ్రిల్‌కు గురిచేసింది. ఒకే రోజు ఏకంగా 19 వికెట్లు నేలకూలాయి. ఈ రోజు ఆట మొత్తం ఫాస్ట్ బౌలర్ల ఆధిపత్యం నడిచింది. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఇంగ్లండ్‌ను కూల్చగా ఆ తర్వాత ఇంగ్లండ్‌కు చెందిన బెన్ స్టోక్స్ ఆస్ట్రేలియాను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. ఇంగ్లండ్ స్కోరు కంటే ఇంకా 49 పరుగులు వెనుకబడి ఉంది.

టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ఆ నిర్ణయం బెడిసికొట్టింది. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ మొదటి రోజు, మొదటి ఓవర్ చివరి బంతికే జాక్ క్రాలీని డకౌట్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాడు. ఇంగ్లండ్ 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఓలీ పోప్ (46 పరుగులు), హ్యారీ బ్రూక్ (52 పరుగులు) మధ్య 55 పరుగుల భాగస్వామ్యం కొంత ఊరటనిచ్చింది. 5 వికెట్లకు 160 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉన్న ఇంగ్లండ్, హ్యారీ బ్రూక్ 51 పరుగుల వద్ద ఔట్ అయిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. తరువాత 12 పరుగుల్లోనే మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయి, ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 172 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా తరఫున మిచెల్ స్టార్క్ ఒక్కడే 7 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించాడు.

ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించినప్పుడు, ఇంగ్లండ్ పేసర్లు మరింత ఘోరంగా దెబ్బ తీశారు. ఆర్చర్, ఇన్నింగ్స్ మొదటి ఓవర్ రెండో బంతికే జాక్ వెదెరాల్డ్‌ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్, బ్రైడాన్ కార్స్ ల ఉధృతమైన బౌలింగ్ ధాటికి స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ వంటి టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు కూడా నిలబడలేకపోయారు. ఆస్ట్రేలియా 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ట్రెవిస్ హెడ్ (21 పరుగులు), కామెరాన్ గ్రీన్ (24 పరుగులు) మధ్య 45 పరుగుల భాగస్వామ్యం జట్టును ఆదుకుంది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ఆస్ట్రేలియా మిడిల్, లోయర్ ఆర్డర్‌ను ధ్వంసం చేశాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి స్టోక్స్ ఒక్కడే 5 వికెట్లు తీశాడు. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. అంటే ఒకే రోజు మొత్తం 19 వికెట్లు పడిపోయాయి. ఈ టెస్ట్ మ్యాచ్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us