Video: ఏం బౌలింగ్ రా బాబు..! బనానా స్వింగ్ డెలివరీతో అదరగొట్టిన తెలుగమ్మాయి..

టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు జార్జియా వోల్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్‌లు తొలి వికెట్‌కు 58 పరుగులు జోడించి మంచి స్టార్ట్ అందించారు. ప్రతి మ్యాచ్‌లో  స్థిరమైన ప్రదర్శనలతో భారత్‌కు తలనొప్పిగా మారిన వోల్ ఈ మ్యాచ్లో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడింది.

Video: ఏం బౌలింగ్ రా బాబు..! బనానా స్వింగ్ డెలివరీతో అదరగొట్టిన తెలుగమ్మాయి..
Arundhati Reddy's Viral Banana Swing Delivery
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Dec 11, 2024 | 1:48 PM

పెర్త్‌లోని ఐకానిక్ WACAలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ ODIలో ఉత్కంఠభరితమైన ప్రదర్శనను అందించిన టీమిండియా ప్లేయర్ అరుంధతి రెడ్డి భారత్‌కి హీరోగా నిలిచింది. భారత పేసర్ అరుంధతి రెడ్డి నాలుగు వికెట్లు తీసింది. తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్‌ను కూల్చివేసింది. దీంతో ఆమెను పలువురు ప్రశంసిస్తున్నారు.

టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు జార్జియా వోల్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్‌లు తొలి వికెట్‌కు 58 పరుగులు జోడించి మంచి స్టార్ట్ అందించారు. ప్రతి మ్యాచ్‌లో  స్థిరమైన ప్రదర్శనలతో భారత్‌కు తలనొప్పిగా మారిన వోల్ ఈ మ్యాచ్లో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడింది. 11వ ఓవర్‌లో టీమిండియా పేసర్ అరుంధతి రెడ్డి ఆఫ్ స్టంప్ చుట్టూ బంతిని వేసింది. దానికి వోల్ డిఫెన్స్ ఆడి క్యాచ్ ఇచ్చింది. 29 బంతుల్లో 26 పరుగులు చేసిన వోల్ ఒక్కసారిగా వెనుదిరిగింది. ఇది మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఆమె అదే ఓవర్‌లో మళ్లీ 25 పరుగుల వద్ద లిచ్‌ఫీల్డ్‌ను అరుంధతి రెడ్డి పెవిలియన్‌కు పంపింది. డబుల్ స్ట్రైక్ ఆస్ట్రేలియాను దద్దరిల్లేలా చేసింది. భారత్ బౌలింగ్ దాడికి ఆసీస్ బ్యాటర్లు చేతులేత్తేసారు.

వీడియో ఇదిగో:

భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, ఉమా చెత్రీ, హర్లీన్ డియోల్, రిచా ఘోష్, మిన్ను మణి, తేజల్ హసబ్నిస్, ప్రియా మిశ్రా, ప్రియా పునియా, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, టిటాస్ సాధు, దీప్తి , రాధా యాదవ్, సైమా ఠాకోర్

ఆస్ట్రేలియా జట్టు: జార్జియా వోల్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, ఎల్లీస్ పెర్రీ, కిమ్ గార్త్, తహ్లియా మెక్‌గ్రాత్ (c), బెత్ మూనీ (WK), అలనా కింగ్, డార్సీ బ్రౌన్, జార్జియా వేర్‌హామ్, మేగాన్ షుట్, సోఫీ మోలినెక్స్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి