Ambati Rayudu Trolls Virat Kohli: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు మరోసారి RCB, విరాట్ కోహ్లీని టార్గెట్ చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ IPL 2024 ఫైనల్‌ను గెలుచుకున్న తర్వాత విరాట్ కోహ్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేర్లను తీసుకోకుండానే ఏకిపారేశాడు. ఆరెంజ్ క్యాప్ గెలిచినంత మాత్రాన ఐపీఎల్ ట్రోఫీ అందదని, ఇందుకు ఆటగాళ్లందరూ సహకరించాలని రాయుడు ట్వీట్ చేశాడు.
నిజానికి RCB తమ చివరి లీగ్ స్టేజ్ మ్యాచ్‌లో CSKని ఓడించినప్పుడు, RCB ఆటగాళ్లు, అభిమానుల సంబరాలతో అంబటి రాయుడు చాలా కోపంగా ఉన్నాడు. అప్పటి నుంచి అతను RCB అభిమానులను, విరాట్ కోహ్లీపై కోపంగా ఉన్నాడు. ఈమేరకు ఇప్పటికే ట్విట్టర్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నాడు.
‘Orange Cap doesn’t win you IPL’
~ Ambati Rayudu
— Cricketopia (@CricketopiaCom) May 27, 2024
ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగులు చేయడం ద్వారా విరాట్ కోహ్లి ఆరెంజ్ క్యాప్ అవార్డును గెలుచుకున్నాడు. అంబటి రాయుడు ఇదే విషయంపై విమర్శలు గుప్పించాడు. KKR ట్రోఫీని గెలుచుకున్న తర్వాత స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన సంభాషణలో మాట్లాడుతూ, KKR జట్టు కోసం, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్ వంటి వారి వెటరన్ ఆటగాళ్లు అద్భుతమైన సహకారాన్ని అందించారు. అందరూ సహకరించకుంటే జట్లు ఐపీఎల్ ట్రోఫీని ఎలా గెలుస్తాయి. మీరు ఆరెంజ్ క్యాప్ గెలవడం ద్వారా IPL గెలవలేరు. కానీ, ఆటగాళ్లందరూ కలిసి ప్రదర్శన చేయాల్సి ఉంటుందని తెలిపాడు.
My heart truly goes out to all the rcb supporters who have passionately supported the team over the years. If only the management and the leaders had the teams interests ahead of individual milestones .. rcb would have won multiple titles. Just remember how many fantastic players…
— ATR (@RayuduAmbati) May 24, 2024
గతంలో విరాట్ కోహ్లీపై అంబటి రాయుడు కూడా ఘాటుగా స్పందించాడు. RCB నిష్క్రమణ తర్వాత రాయుడు సోషల్ మీడియా హ్యాండిల్ X లో పోస్ట్ చేశాడు. RCB మద్దతుదారులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే వారు చాలా సంవత్సరాలుగా జట్టుకు నిరంతరం మద్దతు ఇస్తున్నారు. టీమ్ మేనేజ్‌మెంట్, లీడర్‌లు వ్యక్తిగత గణాంకాలకు బదులుగా జట్టు ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదు. RCB 17 ఏళ్లుగా టైటిల్‌లను గెలుచుకులేదు. జట్టు ఎంత మంది గొప్ప ఆటగాళ్లను వదిలిపెట్టిందో గుర్తుంచుకోండి. జట్టు ప్రయోజనాల కోసం అటువంటి ఆటగాళ్లను తిరిగి తీసుకురావాలని మీరు మీ జట్టుపై ఒత్తిడి తేవాలి. మెగా వేలంతో కొత్త అధ్యాయం ప్రారంభం అవ్వాలి’ అంటూ సూచించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..