టీ20ల్లో 70 సిక్సర్లు కొట్టాడు.. కట్ చేస్తే.. 70 బంతుల్లో మ్యాచ్ ముగించాడు.. ఎవరో తెలుసా?

|

Dec 30, 2022 | 1:41 PM

క్రికెట్ పొట్టి ఫార్మాట్‌ అయిన టీ20 మ్యాచ్‌లు ప్రేక్షకులకు కావల్సినంత మజాను ఇస్తున్నాయి. ఇందులో ఓ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్..

టీ20ల్లో 70 సిక్సర్లు కొట్టాడు.. కట్ చేస్తే.. 70 బంతుల్లో మ్యాచ్ ముగించాడు.. ఎవరో తెలుసా?
T20 Match
Follow us on

క్రికెట్ పొట్టి ఫార్మాట్‌ అయిన టీ20 మ్యాచ్‌లు ప్రేక్షకులకు కావల్సినంత మజాను ఇస్తున్నాయి. ఇందులో ఓ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ప్రపంచంలోని దాదాపు ప్రతీ లీగ్‌లోనూ తన రికార్డులను నెలకొల్పాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో అలెక్స్ హేల్స్ తుఫాన్ బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపిస్తున్నాడు. అక్కడ అతడు ఒక మ్యాచ్‌ను కేవలం 11.4 ఓవర్లలో అంటే 70 బంతుల్లోనే ముగించాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో 70 సిక్సర్లు నమోదైన చేసిన ఈ బ్యాటర్ కేవలం 70 బంతులు జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు.

బిగ్ బాష్ లీగ్‌లో, డిసెంబర్ 27న బ్రిస్బేన్ హీట్, సిడ్నీ థండర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో హేల్స్ సిడ్నీ థండర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఓపెనర్‌గా వచ్చిన అతడు తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. కేవలం 11.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 121 పరుగులు చేసింది. తద్వారా సిడ్నీ థండర్స్ జట్టుకు 122 పరుగుల విజయలక్ష్యాన్ని విధించింది. ఇక ఆ జట్టు బ్యాటర్లు అలెక్స్ హేల్స్, మాథ్యూ గైక్స్ 70 బంతుల్లో మ్యాచ్ ముగించారు. ఈ మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ 10 వికెట్ల తేడాతో భారీ విజయం అందుకుంది.

అలెక్స్ హేల్స్ 52 నిమిషాల్లో 36 బంతులకు 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు ఉన్నాయి. అటు వైపు మాథ్యూ గైక్స్ కూడా 52 నిమిషాల్లో 34 బంతులకు 56 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.