నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ సిరీస్‌లో విజయం సాధించేందుకు ఆస్ట్రేలియా.. విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్‌లను టార్గెట్ చేస్తుందనడంలో సందేహం లేదు. అటు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబూషేన్‌ల వికెట్లు టీమ్ ఇండియాకు కీలకం. ఈ మూడు వికెట్లు పడగొట్టడంలో టీమిండియా పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ఇదిలా ఉంటే.. ఓ ఆస్ట్రేలియా బ్యాటర్ తాజా ఫామ్ భారత జట్టును మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అతడెవరో కాదు అలెక్స్ క్యారీ. మిడిల్ ఆర్డర్‌లో ఆస్ట్రేలియాకు పిల్లర్‌గా అలెక్స్ క్యారీ నిలబడటం ఖాయంగా కనిపిస్తోంది.
ఇది చదవండి: తెల్లారి వాకింగ్ చేస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా
రెండు నెలల క్రితమే ఇంగ్లాండ్ పర్యటనలో వన్డే సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన క్యారీ.. ఇప్పుడు ఆస్ట్రేలియా దేశవాళీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో తన అద్భుతమైన బ్యాటింగ్‌ను కొనసాగించాడు. బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌కు సన్నాహకంగా దక్షిణ ఆస్ట్రేలియా తరపున క్యారీ కేవలం 3 మ్యాచ్‌ల్లోని 6 ఇన్నింగ్స్‌లలో 90 సగటుతో 452 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతడి బ్యాట్‌తో రెండు భారీ సెంచరీలు వచ్చాయి. అలాగే 6 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 90, 111, 42, 123(నాటౌట్), 44, 42 పరుగులు చేశాడు. అలెక్స్ క్యారీ గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో 40కి తక్కువ స్కోరు చేయకపోవడం విశేషం. ఈ విపరీతమైన ఫామ్ టీమిండియాకు ఆందోళన కలిగిస్తోంది. భారత్‌తో మొదలయ్యే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అలెక్స్ క్యారీ వికెట్ కీపర్‌గా ఖాయం అనిపిస్తోంది. టాప్ ఆర్డర్‌లో ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, ట్రావిస్ హెడ్‌లు ఉండగా.. ఫామ్‌లో ఉన్న క్యారీ ఫినిషర్‌గా బరిలోకి దిగనున్నాడు.
ఇది చదవండి: విశాఖలో ఉన్నట్టుండి వెనక్కి వెళ్లిన సముద్రం.. ఎన్ని మీటర్లో తెలిస్తే..
ఒకవైపు క్యారీ.. ఆ తర్వాత పాట్ కమిన్స్ సహా బౌలర్లు కూడా లోయర్ ఆర్డర్‌లో సపోర్ట్ ఇస్తారు. పరిస్థితులకు అనుగుణంగా బ్యాట్ ఝుళిపించగల సత్తా ఉన్న క్యారీ.. వేగంగా బ్యాటింగ్ చేయడంలోనూ పేరు తెచ్చుకున్నాడు. తద్వారా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ టెంపోను మార్చగల ఆటగాడు అలెక్స్ క్యారీ. అందుకే ప్రస్తుతం అలెక్స్ క్యారీ అద్భుతమైన ఫామ్ ఆస్ట్రేలియా జట్టుకు ఆనందాన్ని కలిగిస్తుంటే.. టీమిండియాను భయాందోళనకు గురి చేస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు అలెక్స్ క్యారీని కట్టడి చేసేందుకు భారత జట్టు స్పెషల్ ప్లాన్ వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇది చదవండి: బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా..? తింటే ఇక పోతారు అంతే..
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..