Aakash Chopra: గంభీర్‌కు అన్నీ ఇచ్చారు.. చెప్పిందల్లా చేశారు.. అతనిప్పుడు విజయాలు ఇవ్వాలి! హెడ్‌కోచ్‌కు షాక్..!
మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. గంభీర్ నాయకత్వంలో జట్టు బలపడుతుందని భావించినప్పటికీ, ఇంగ్లాండ్‌తో టెస్ట్ ఓటమి ఆ సందేహాలను రేకెత్తించిందని అన్నారు. ఈ ఓటమి గంభీర్‌పై ఒత్తిడిని పెంచుతుందని చోప్రా అభిప్రాయపడ్డారు.

తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత టీమిండియా శక్తివంతం అవుతుందని ఆశించారని, వైట్-బాల్ క్రికెట్‌లో మంచి ఫలితాలు వచ్చినప్పటికీ, టెస్ట్ క్రికెట్‌లో జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిందని చోప్రా తెలిపారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో ఓటముల తర్వాత, శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో సిరీస్ దారుణంగా ప్రారంభమైంది. గంభీర్ తన వ్యూహాలతో ఫలితాలు సాధించాలని, లేకపోతే ఒత్తిడి పెరుగుతుందని చోప్రా హెచ్చరించారు.
ఆస్ట్రేలియా సిరీస్ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు టెస్ట్ కెరీర్‌ను ముగించారు. గిల్ నేతృత్వంలో కొత్త జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో చెడు అనుభవంతో మొదలైంది. గిల్ కొత్తగా కెప్టెన్ అయినందున అతన్ని నిందించలేమని, కానీ గంభీర్‌పై ప్రశ్నలు తప్పవని చోప్రా అన్నారు. “భారత క్రికెట్ బాగుంటే అందరూ గర్విస్తారు, చెడితే విమర్శలు తప్పవు. గిల్ కొత్త కెప్టెన్ కాబట్టి అతనిపై ఓపికగా ఉంటాను, కానీ గంభీర్‌పై ప్రశ్నలు ఉంటాయి” అని చోప్రా పేర్కొన్నారు.
గంభీర్‌పై ఖచ్చితంగా ఒత్తిడి..
గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్న సమయంలో, భారత జట్టు చివరి తొమ్మిది టెస్ట్ మ్యాచ్‌లలో కేవలం బంగ్లాదేశ్‌తో జరిగిన ఒక టెస్ట్ సిరీస్‌ను మాత్రమే గెలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో 3-0 తేడాతో వైట్‌వాష్ అయింది, ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో కోల్పోయిందన్నారు.
గంభీర్‌పై భారీ ఒత్తిడి ఉందని, టెస్ట్ క్రికెట్‌లో అతని పనితీరు సరిగా లేదని అన్నారు. “గౌతమ్ గంభీర్‌పై చాలా ఒత్తిడి ఉంది. టెస్ట్ క్రికెట్‌లో అతని రికార్డును చూస్తే, అతను ఎక్కువ మ్యాచ్‌లు గెలవలేదు. బంగ్లాదేశ్‌పై రెండు మ్యాచ్‌లు, ఆస్ట్రేలియాపై ఒక మ్యాచ్ మాత్రమే గెలిచాడని తెలిపాడు. కానీ న్యూజిలాండ్‌తో మూడు, ఆస్ట్రేలియాతో మూడు, ఇంగ్లాండ్‌తో ఒక మ్యాచ్‌లను తాము కోల్పోయామని తెలిపాడు.
గంభీర్‌కు బీసీసీఐ నుండి అడిగిన ప్రతి విషయం అందించబడిందని, కాబట్టి సాకులు చెప్పేందుకు అతనికి ఎటువంటి అవకాశం లేదన్నారు. ఫలితాలు అందించాల్సిన సమయం ఆసన్నమైందని చోప్రా అన్నారు. “వైట్-బాల్ క్రికెట్‌లో అతని పనితీరు బాగుంది. జట్టు బాగా ఆడుతోంది. కానీ టెస్ట్ క్రికెట్‌లో జట్టు ప్రదర్శనపై చాలా ప్రశ్నలు ఉన్నాయన్నారు. ఇంగ్లాండ్ సిరీస్‌పై చాలా ఒత్తిడి ఉందని. ఒకవేళ ఈ సిరీస్ బాగా జరగకపోతే, ప్రశ్నలు తలెత్తుతాయని పేర్కొన్నారు. భారత క్రికెట్ బాగా ఆడాలని కోరుకుంటున్నాను,” అని చోప్రా అన్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




