PAK vs AFG: పాక్‌కు షాకిచ్చిన ఆఫ్టాన్‌.. తొలిసారిగా టీ20 మ్యాచ్‌లో గెలుపు.. రికార్డు బద్దలు

|

Mar 25, 2023 | 7:48 AM

శుక్రవారం పాక్‌తో జరిగిన తొలి టీ20లో ఆ జట్టు అద్భుత విజయం సాధించింది. టీ20లో పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్థాన్‌ విజయం సాధించడం ఇదే తొలిసారి . స్టార్ ఆటగాళ్ల గైర్హాజరీతో మ్యాచ్‌కు ముందే డీలా పడిన పాక్‌ మైదానంలో మరింత దారుణంగా విఫలమైంది.

PAK vs AFG: పాక్‌కు షాకిచ్చిన ఆఫ్టాన్‌.. తొలిసారిగా టీ20 మ్యాచ్‌లో గెలుపు.. రికార్డు బద్దలు
Pakistan Vs Afghanistan
Follow us on

శుక్రవారం (మార్చి 24) ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌కు చాలా ప్రత్యేకమైన రోజు అని చెప్పవచ్చు. ఎందుకంటే శుక్రవారం పాక్‌తో జరిగిన తొలి టీ20లో ఆ జట్టు అద్భుత విజయం సాధించింది. టీ20లో పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్థాన్‌ విజయం సాధించడం ఇదే తొలిసారి . స్టార్ ఆటగాళ్ల గైర్హాజరీతో మ్యాచ్‌కు ముందే డీలా పడిన పాక్‌ మైదానంలో మరింత దారుణంగా విఫలమైంది. కేవలం 92 పరుగులు మాత్రమే చేసి అవమానకర రీతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. కెప్టెన్‌ బాబర్ ఆజం, స్టార్‌ ఓపెనర్‌ మహ్మద్ రిజ్వాన్, స్పీడ్‌స్టర్‌ షాహీన్ అఫ్రిది వంటి స్టార్‌ ప్లేయర్లకు ఈ సిరీస్‌లో విశ్రాంతి నిచ్చింది. దీంతో పాక్‌ బ్యాటింగ్‌ చెల్లాచెదురైంది. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లను ఎదుర్కొలేక తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 92 పరుగులు మాత్రమే చేసింది. తొజట్టులో కేవలం నలుగురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరును దాటగలిగారు. ఇమాద్ వాసిమ్ 18 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవాడు. పీఎస్‌ఎల్‌లో మెరుపు మెరిపించిన షఫీక్, ఆజంఖాన్‌లు అసలు ఖాతా కూడా తెరవలేకపోయారు. తయ్యబ్ తాహిర్ 16, సయీమ్ అయూబ్ 17 పరుగులు చేయగా.. కెప్టెన్ షాదాబ్ ఖాన్ కూడా 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అఫ్గానిస్థాన్‌ బౌలర్లలో ఫజల్‌హక్‌ ఫరూఖీ, ముజీబ్‌, మహ్మద్‌ నబీ చెరో 2 వికెట్లు తీయగా, రషీద్‌ ఖాన్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, అజ్మతుల్లా ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్గన్‌ను పాక్ బౌలర్లు కట్టడి చేసినప్పటికీ మరీ స్వల్ప స్కోరు కావడంతో పరాజయం తప్పలేదు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసి రాణించిన మహ్మద్ నబీ 38 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 16 పరుగులు చేశాడు. ఆల్‌రౌండ్‌ పెర్ఫామెన్స్‌తో జట్టును గెలిపించిన నబీకే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..