Team India Schedule: టార్గెట్ 2024 వరల్డ్ కప్.. ఆ దేశంతో తొలిసారి టీ20 సిరీస్ ఆడనున్న భారత్.. షెడ్యూల్ విడుదల..
IND vs AFG: టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఇప్పటి వరకు 4 వన్డేలు జరిగాయి. ఇందులో అఫ్గానిస్థాన్‌పై టీమిండియా సత్తా చాటింది. టీమ్ ఇండియా ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 గెలిచింది. 1 మ్యాచ్ టై అయింది. అలాగే, ఇప్పటి వరకు ఆడిన 5 టీ20 మ్యాచ్‌ల్లో టీమ్ ఇండియా 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 1 మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. అంటే, టీమ్ ఇండియాపై ఆఫ్ఘనిస్థాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అయితే 2023 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ అద్భుత ప్రదర్శన చేసింది. తద్వారా రాబోయే టీ20 సిరీస్‌లో టీమ్‌ఇండియా, అఫ్గానిస్థాన్‌ల మధ్య గట్టిపోటీని ఆశించవచ్చని అంతా భావిస్తున్నారు.

2023 వన్డే ప్రపంచకప్ (ICC World Cup 2023) తర్వాత ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా (India Vs Australia) సిద్ధమైంది. ఈ సిరీస్‌కు ఇప్పటికే టీమ్ ఇండియాను ప్రకటించగా, సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. నవంబర్ 23 నుంచి ఈ టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత, టీమ్ ఇండియా దక్షిణాఫ్రికాలో పర్యటించి, జనవరిలో అంటే 2024 మొదటి నెలలో అఫ్గానిస్తాన్ (India Vs Afghanistan)తో మొదటిసారి T20ఐ సిరీస్ ఆడనుంది. ఈ మేరకు ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోందని ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు తెలియజేసింది. ఈ సిరీస్ కోసం ఆఫ్ఘన్ జట్టు భారత్‌కు రానుంది.
టీమ్ ఇండియా జనవరి 2024లో ఆఫ్ఘనిస్తాన్‌తో 3-మ్యాచ్‌ల T20 సిరీస్‌ను ఆడుతుంది. అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్ ఆడడం ఇదే తొలిసారి. ఈ సిరీస్ షెడ్యూల్ కూడా సిద్ధమైంది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ సమాచారాన్ని తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.
తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు వరుసగా మొహాలీ, ఇండోర్, బెంగళూరులలో జరగనున్నాయి. తొలి మ్యాచ్ జనవరి 11న, చివరి మ్యాచ్ జనవరి 17న జరగనుంది. ఈ మూడు మ్యాచ్‌లు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు టీమ్ ఇండియా, ఆఫ్ఘనిస్థాన్‌లు ప్రపంచకప్, ఆసియాకప్‌లో తలపడ్డాయి. ఇరు జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ కూడా జరిగింది. అయితే, ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో ఇరు జట్లు తలపడడం ఇదే తొలిసారి.
భారత్-ఆఫ్ఘనిస్థాన్ గత లెక్కలు..
View this post on Instagram
కాగా, టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఇప్పటి వరకు 4 వన్డేలు జరిగాయి. ఇందులో అఫ్గానిస్థాన్‌పై టీమిండియా సత్తా చాటింది. టీమ్ ఇండియా ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 గెలిచింది. 1 మ్యాచ్ టై అయింది. అలాగే, ఇప్పటి వరకు ఆడిన 5 టీ20 మ్యాచ్‌ల్లో టీమ్ ఇండియా 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 1 మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. అంటే, టీమ్ ఇండియాపై ఆఫ్ఘనిస్థాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అయితే 2023 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ అద్భుత ప్రదర్శన చేసింది. తద్వారా రాబోయే టీ20 సిరీస్‌లో టీమ్‌ఇండియా, అఫ్గానిస్థాన్‌ల మధ్య గట్టిపోటీని ఆశించవచ్చని అంతా భావిస్తున్నారు.
టీ20 సిరీస్ షెడ్యూల్..
మొదటి మ్యాచ్, జనవరి 11, మొహాలీ.
రెండవ మ్యాచ్, జనవరి 14, ఇండోర్.
మూడో మ్యాచ్, జనవరి 17, బెంగళూరు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..