ఔట్ చేయలేకపోతున్నాం, మా బౌలర్ల దూల తీర్చేస్తున్నాడు.. అభిషేక్ శర్మ బ్యాటింగ్‌పై కివీస్ కోచ్ ఆందోళన
Abhishek Sharmas Dominant Batting Poses Challenge for New Zealand in T20 Series: టీ20 ఫార్మాట్‌లో అభిషేక్ శర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అతని విధ్వంసకర బ్యాటింగ్‌ను కట్టడి చేయలేక ప్రత్యర్థులు చేతులెత్తేశారు. న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్ జాకబ్ ఓరమ్ సైతం అభిషేక్‌ను అవుట్ చేయడం కష్టమని అంగీకరించాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు అతని ఆధిపత్యం కొనసాగుతోంది.

Abhishek Sharmas Dominant Batting Poses Challenge for New Zealand in T20 Series: టీ20 క్రికెట్‌లో అభిషేక్ శర్మ ప్రస్తుతానికి నెంబర్ వన్ బ్యాటర్‌గా తనదైన ముద్ర వేస్తున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో ఆధిపత్యం చెలాయిస్తూ, బ్యాటింగ్‌లో విశ్వరూపం చూపిస్తున్నాడు. ఎటువంటి భయం లేకుండా అన్ని వైపులా షాట్లు బాదుతూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లోనూ అభిషేక్ శర్మ రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్నాడు. కివీస్ బౌలింగ్‌ను బలహీనమైనదిగా పరిగణించనప్పటికీ, క్రీజ్‌లో అభిషేక్ శర్మ ఉంటే న్యూజిలాండ్ బౌలర్లు అతన్ని కట్టడి చేయలేక చేతులెత్తేస్తున్నారు. యువ ఓపెనర్‌కు బౌలింగ్ చేయాలంటేనే భయపడుతున్నారని, ఎలా కట్టడి చేయాలో తెలియక టెన్షన్ పడుతున్నారని వారి బాడీ లాంగ్వేజ్ స్పష్టం చేస్తోంది.
న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్ జాకబ్ ఓరమ్ స్వయంగా ఈ విషయంపై స్పందిస్తూ, అభిషేక్ శర్మను అవుట్ చేయలేకపోతున్నామని, అతని స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉందని పేర్కొన్నాడు. అభిషేక్‌లోని వీక్ పాయింట్స్‌ను గుర్తించలేకపోతున్నామని, తమ ప్రణాళికలను అమలు చేయలేకపోతున్నామని అంగీకరించాడు. ప్రస్తుతం అభిషేక్ శర్మ టీమిండియాకు ప్రమాదకరమైన బ్యాటర్‌గా మారాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందే ప్రత్యర్థులను భయపెడుతున్నాడు. ప్రపంచకప్‌లోనూ అతని ఆటతీరుపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
నాగ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో తన ఆటతీరును న్యూజిలాండ్ బౌలర్లకు రుచి చూపించాడు. కేవలం 35 బంతుల్లోనే 84 పరుగులు సాధించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. రెండో మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుతిరిగినప్పటికీ, మూడో మ్యాచ్‌లో మళ్లీ కసితో బ్యాటింగ్ చేశాడు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు పెవిలియన్ చేరినప్పటికీ, అభిషేక్ టాప్ గేర్‌లో దూసుకుపోయాడు. 20 బంతుల్లోనే 68 పరుగులతో నాట్ అవుట్‌గా నిలిచాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు పూర్తయితే, అందులో అభిషేక్ శర్మ రెండు అర్ధ సెంచరీలు సాధించాడు.
మొత్తంగా అభిషేక్ శర్మ ఇప్పుడు ప్రమాదకరమైన బ్యాటర్‌గా మారాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందే ప్రత్యర్థులను భయపెడుతున్నాడు. అయితే అభిషేక్‌ను కట్టడి చేయడానికి ప్రపంచకప్‌లో సరికొత్త ప్రణాళికలతో బౌలర్లు బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ విషయం అభిషేక్‌కు కూడా తెలుసు. అందుకే అభిషేక్ పాజిటివ్ మైండ్‌సెట్‌తో బరిలోకి దిగుతున్నాడు. ప్రపంచ స్థాయి బౌలర్లను పవర్ ప్లేలోనే ఒత్తిడిలోకి నెట్టడంపై అతను దృష్టి పెడుతున్నాడు. తొలి ఓవర్‌లోనే భారీగా పరుగులు సాధిస్తే ఆ తర్వాత బ్యాటర్స్‌పై ఒత్తిడి తగ్గుతుందని అభిషేక్ నమ్ముతున్నాడు. టీమ్ మేనేజ్‌మెంట్ కూడా అభిషేక్ నుంచి మెరుపు బ్యాటింగ్‌నే కోరుకుంటోంది. దీంతో టీ20 ప్రపంచకప్‌లో ఈ యువ ఓపెనర్ ఆటతీరు ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోతోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
