IPL 2024: ‘పరుగులు చేయకున్నా అతనిని ఎందుకు కొనసాగించారు?’.. ఆర్సీబీపై ఏబీడీ షాకింగ్‌ కామెంట్స్‌

ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధమవుతోంది. వేలానికి ముందు ఆ జట్టు మొత్తం 19 మంది ఆటగాళ్లను రిటైన్‌ చేసుకుంది. అయితే ఈ ప్రక్రియలో ఆర్సీబీ యాజమాన్యం తీసుకున్న కొన్ని నిర్ణయాలను తనను ఆశ్చర్యపరిచాయని ఆ జట్టు మాజీ ఆటగాడు ఏబీ డివిలీయర్స్ అభిప్రాయపడ్డాడు.

IPL 2024: పరుగులు చేయకున్నా అతనిని ఎందుకు కొనసాగించారు?.. ఆర్సీబీపై ఏబీడీ షాకింగ్‌ కామెంట్స్‌
AB de Villiers

Updated on: Dec 03, 2023 | 9:41 PM

ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధమవుతోంది. వేలానికి ముందు ఆ జట్టు మొత్తం 19 మంది ఆటగాళ్లను రిటైన్‌ చేసుకుంది. అందులో వికెట్‌ కీపర్‌ అండ్‌ సీనియర్‌ బ్యాటర్‌ దినేష్ కార్తీక్ ఉన్నాడు. అయితే గత సీజన్‌లో పెద్దగా పరుగులు చేయని దినేష్‌ కార్తీక్‌ను రిటైన్‌ చేసుకోవడంపై ఆర్సీబీ మాజీ ప్లేయర్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. గత సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసినప్పటికీ ఆర్‌సీబీ దినేష్ కార్తీక్‌ను కొనసాగించాలని నిర్ణయించుకుంది. అదే సమయంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ను వదిలేసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్‌సీబీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలు తనను ఆశ్చర్యపరిచాయని ఏబీ డివిలియర్స్ తెలిపాడు. IPL 2023లో, దినేష్ కార్తీక్ 13 మ్యాచ్‌లలో 11.66 సగటుతో 140 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే ఈ ఐపీఎల్‌కు కూడా 37 ఏళ్ల దినేశ్ కార్తీక్‌ను రిటైన్‌ చేశారు.దీనిపై స్పందించిన ఏబీడీ ‘దినేష్ కార్తీక్‌ను రిటైన్ చేయడం నాకు ఆశ్చర్యంగా ఉంది. గత సీజన్‌లో అతను పెద్దగా పరుగులు చేయలేదు. అయితే, RCB వారి పర్స్ మొత్తాన్ని పెంచుకోవడానికి ఈ వికెట్ కీపర్‌ని ఎంచుకోవచ్చని నేను అనుకుంటున్నాను. అయితే వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా దినేష్ కార్తీక్‌ను కొనసాగించడం ఆశ్చర్యం కలిగించింది. వావిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్ కూడా విడుదల చేశారు. ఈ ముగ్గురు జట్టుకు ఎన్నో విజయాలు గెలిపించారు. ముఖ్యంగా, హేజిల్‌వుడ్ మంచి బౌలర్. అతను RCB బౌలింగ్ లైనప్‌ను బలోపేతం చేస్తాడు. అయితే అతడిని రిటైన్‌ చేసుకోకుండా విడుదల చేయడం మరో ఆశ్చర్యకరమైన చర్య ‘ అని ఏబీడీ కామెంట్స్‌ చేశాడు.

RCB రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితా:

ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రార్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరూన్ గ్రీన్.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..