Rashid Khan: రషీద్ ఖాన్ స్పిన్ బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. అలాగే అప్పుడప్పుడు బ్యాట్‌తో కూడా సంచలన ఇన్నింగ్స్‌లు ఆడుతూ ప్రత్యర్థులకు దడ పుట్టిస్తుంటాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటుతోన్న రషీద్ ఖాన్.. ఇంగ్లాండ్‌లో ఆడిన ఓ మ్యాచ్‌లో దుమ్ము దులిపాడు. టీ 20 బ్లాస్ట్‌లో పరుగుల సునామీ సృష్టించి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటుతున్న రషీద్ ఖాన్.. ఇంగ్లాండ్‌లో ఆడిన ఓ మ్యాచ్‌లో దుమ్ము దులిపాడు. అద్భుతమైన టీ 20 బ్లాస్ట్‌తో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. హాంప్‌షైర్, ససెక్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ససెక్స్ తరపున బరిలోకి దిగిన ఈ ఆఫ్ఘనిస్తాన్ సూపర్ స్టార్.. బ్యాటింగ్ చేసిన కొద్దిసేపట్లో తుఫాన్ సృష్టించాడు. ధోని హెలికాప్టర్ షాట్‌లతో బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. ఈ మ్యాచ్‌లో సస్సెక్స్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 183 పరుగులు చేసింది. ఇందులో రషీద్ ఖాన్ బ్యాటింగ్ గుర్తుండిపోయేలా మార్స్ క్రియోట్ చేసి పెట్టాడు. రషీద్ ఖాన్ ససెక్స్ జట్టులో టాప్ స్కోరర్ కాదు, అయినా ప్రజల దృష్టిని ఆకర్షించగలిగాడంటే మాత్రం… హాంప్‌షైర్‌పై 200 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేయడమే.
18 నిమిషాల్లో 200 స్ట్రైక్ రేట్‌తో సునామీ…
రషీద్ ఖాన్ క్రీజులో కేవలం 18 నిమిషాలు మాత్రమే ఉన్నాడు. ఈ సమయంలో కేవలం 13 బంతులను మాత్రమే ఎదుర్కొన్నాడు. 200 స్ట్రైక్ రేట్‌తో 26 పరుగులు సాధించాడు. రషిద్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. ఈ సిక్స్ మాత్రం అందరి హృదయాలను గెలుచుకుంది. ఎందుకంటే.. ఈ సిక్స్ ధోని ట్రేడ్‌మార్క్ షాట్.. అంగే హెలికాప్టర్ షాట్ ఆడాడు. దాంతో సూపర్ ఇన్నింగ్స్ నెలకొల్పి అందరిని ఆకట్టుకున్నాడు. రషీద్ కొట్టిన హెలికాప్టర్ షాట్ ధోనిని కాపీ చేసింది మాత్రం కాదు. రషీద్ తనదైన స్టైల్‌ను యాడ్ చేసి సరికొత్త హెలికాప్టర్ షాట్ బాదాడు. అయితే, రషీద్ 18 నిమిషాల్లో సృష్టించిన తుఫాన్.. మ్యాచ్‌ను మాత్రం గెలిపించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో, సస్సెక్స్ విధించిన 184 పరుగుల లక్ష్యాన్ని హాంప్‌షైర్ 4 వికెట్లు కోల్పోయి మరో నాలుగు 4 బంతులు మిగిలుండగానే చేరుకుంది. 6 వికెట్ల తేడాతో హాంప్‌షైర్ విజయం సాధించింది.
Rashid Khan is cutting loose!
A huge 6 from the international star ⭐️
Watch #Blast21 live: https://t.co/YlrUmoqCct pic.twitter.com/lYBs9RmKgF
— Vitality Blast (@VitalityBlast) July 16, 2021
Also Read:
150 బంతులు… 224 పరుగులు.. 17 ఏళ్ల వయసులోనే సంచలనం సృష్టించిన టీమిండియా మహిళ క్రికెటర్!
Tokyo Olympics 2021: ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో కరోనా కలకలం.. మరో ఇద్దరికి పాజిటివ్..