Team India: 90 బంతుల్లో 190 పరుగులు.. ఇంగండ్‌తో సిరీస్‌కు ముందు శివాలెత్తిన టీమిండియా బ్యాటర్.. వీడియో ఇదిగో

 ఐపీఎల్‌లో సంచలనం సృష్టించిన ఈ యంగ్ క్రికెటర్ తాజాగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో శివాలెత్తాడు. ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడుతూ 90 బంతుల్లో ఏకంగా 190 పరుగులు చేశాడు. తద్వరా కఠినమైన గ్లాండ్ పర్యటనకు ముందు భారత జట్టులో ఎనలేని ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు.

Team India: 90 బంతుల్లో 190 పరుగులు.. ఇంగండ్‌తో సిరీస్‌కు ముందు శివాలెత్తిన టీమిండియా బ్యాటర్.. వీడియో ఇదిగో
Team India Cricketer

Updated on: Jun 12, 2025 | 11:39 AM

14 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి చెలరేగాడు. ఇంగ్లాండ్‌కు బయలుదేరే ముందు NCAలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్రీజులో ఉన్న ఆద్యంతం 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన వైభవ్ కేవలం 90 బంతుల్లో 190 పరుగులు చేశాడు. వైభవ్ ఎన్ని సిక్సర్లు బాదాడో ఖచ్చితంగా తెలియదు కానీ క్రీజులో ఉన్నంత సేపు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో భాగమైన వైభవ్ సూర్యవంశీ కేవలం 7 మ్యాచ్‌లు ఆడి 206 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 250కి పైగా పరుగులు చేశాడు. అదే సమయంలో, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ, క్రిస్ గేల్ తర్వాత ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన రెండవ బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు.

U-19 జట్టులో స్థానం

ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న వైభవ్‌ ఇంగ్లాండ్‌లో పర్యటించే అండర్-19 జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌కు బయలుదేరే ముందు, బెంగళూరులో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో వైభవ్ మరోసారి అభిమానులను అలరించాడు. ఇంగ్లాండ్ పర్యటనలో, భారత అండర్-19 జట్టు ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో 50 ఓవర్ల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది, ఆ తర్వాత 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది. దీని తర్వాత, 2 మల్టీ-డే మ్యాచ్‌లు కూడా ఆడతారు.

ఇవి కూడా చదవండి

సూర్య వంశీ బ్యాటింగ్..

ఇంగ్లండ్‌ పర్యటనకు  వెళ్లే భారత అండర్‌-19 జట్టు:

ఆయుశ్‌ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్-కెప్టెన్ & వికెట్‌కీపర్‌), హర్వాన్ష్ సింగ్ (వికెట్‌కీపర్‌), ఆర్‌ ఎస్‌ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్‌ పటేల్, యుద్దజిత్‌ గుహా, ప్రణవ్‌ రాఘవేంద్ర, మొహమ్మద్‌ ఎనాన్‌, ఆదిత్య రాణా, అన్మోల్జీత్ సింగ్

స్టాండ్‌బై ఆటగాళ్లు: నమన్ పుష్పక్, డి దీపేష్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారీ, అలంకృత్ రాపోల్ (వికెట్‌కీపర్‌)

ఇంగ్లండ్‌ పర్యటనలో భారత అండర్‌-19 జట్టు షెడ్యూల్‌..

  • జూన్‌ 24- 50 ఓవర్ల వార్మప్‌ మ్యాచ్‌ (లోగ్‌బరో యూనివర్శిటీ)
  • జూన్‌ 27- తొలి వన్డే (హోవ్‌)
  • జూన్‌ 30- రెండో వన్డే (నార్తంప్టన్‌)
  • జులై 2- మూడో వన్డే (నార్తంప్టన్‌)
  • జులై 5- నాలుగో వన్డే (వార్సెస్టర్‌)
  • జులై 7- ఐదో వన్డే (వార్సెస్టర్‌)
  • జులై 12-15: తొలి మల్టీ డే మ్యాచ్‌ (బెకెన్హమ్‌)
  • జులై 20-23: రెండో మల్టీ డే మ్యాచ్‌ (చెమ్స్‌ఫోర్డ్‌)

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..