CWG 2022: ట్రిపుల్ జంప్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. స్వర్ణంతోపాటు రజతం సొంతం..
కామన్వెల్త్ గేమ్స్ 2022లో ట్రిపుల్ జంప్‌లో భారత్‌కు రెండు పతకాలు వచ్చాయి. భారత్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు ఫైనల్‌కు అర్హత సాధించగా, ఆల్దోస్ పాల్ స్వర్ణం, అబ్దుల్లా రజత పతకాన్ని గెలుచుకున్నారు.
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత అథ్లెట్లు అద్భుతాలు చేశారు. ట్రిపుల్‌జంప్ ఈవెంట్‌లో భారత్ తొలిసారిగా స్వర్ణ పతకం సాధించింది. భారత్‌కు చెందిన అల్డోస్ పాల్ దేశానికి బంగారు పతకాన్ని అందించాడు. అదే సమయంలో ఇదే ఈవెంట్‌లో మరో భారత అథ్లెట్ అబ్దుల్లా రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మరో భారత అథ్లెట్ ప్రవీణ్ కాంస్య పతకాన్ని కొద్దిలో కోల్పోయాడు. అతను నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
పాల్ 17.03 మీటర్ల జంప్‌తో మొదటి స్థానంలో నిలిచాడు. అదే సమయంలో మరో అథ్లెట్ అబ్దుల్లా అబుబకర్ కేవలం .01 తేడాతో రెండవ స్థానంలో నిలిచాడు. అబ్దుల్లా 17.02 మీటర్లు దూకాడు. పాల్ తన తొలి ప్రయత్నంలో 14.62 మీటర్లు దూకాడు. ఆ తర్వాత, అతను తదుపరి ప్రయత్నంలో 16.30 మీటర్లకు చేరుకున్నాడు. అనంతరం పాల్ 17.03 మీటర్లు దూకి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
అబ్దుల్లా అబూబకర్ గురించి మాట్లాడితే, అతను నాల్గవ ప్రయత్నం వరకు 16.70 మీటర్లు మాత్రమే దూకాడు. కానీ, ఐదవ ప్రయత్నంలో ఈ ఆటగాడు 17.02 మీటర్లు దూకి రెండవ నంబర్‌కు చేరుకున్నాడు. ఈ విధంగా అబ్దుల్లా రజత పతకాన్ని అందుకున్నాడు.