CWG 2022: పసిడి పతకం పట్టేసిన అమిత్ పంఘల్.. ఫైనల్లో ఇంగ్లండ్ బాక్సర్‌ను చిత్తు చేసిన భారత స్టార్..
అమిత్ పంఘల్ తన మెడల్ రంగును ఈసారి మార్చుకోగలిగాడు. గతసారి కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకాన్ని సాధించిన ఈ బాక్సర్, ఈసారి మాత్రం స్వర్ణం అందుకున్నాడు.
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత స్టార్ బాక్సర్ అమిత్ పంఘల్ సత్తా చాటాడు. ఇంగ్లండ్‌కు చెందిన బాక్సర్‌పై పంచ్‌లతో చెలరేగి స్వర్ణం దక్కించుకున్నాడు. 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజతంతో సంతృప్తి చెందిన పంఘల్.. ఈసారి 51 కిలోల ఈవెంట్‌లో స్వర్ణం సాధించాడు. పంఘల్ సాధించిన ఈ పతకంతో భారత్ ఖాతాలో 15వ స్వర్ణంగా నిలిచింది. ఫైనల్‌లో ఇంగ్లిష్ బాక్సర్ మెక్‌డొనాల్డ్‌ను చిత్తు చేసి, పతకం రంగును మార్చుకున్నాడు.
మ్యాచ్‌లో పంఘల్ ఆధిపత్యం..
మూడు రౌండ్లలో, పంఘల్ ఇంగ్లీష్ బాక్సర్‌కు తిరిగి వచ్చే అవకాశం ఎక్కడా ఇవ్వలేదు. అతనిపై ఒత్తిడిని కొనసాగిస్తూ, పంచ్‌లతో చెలరేగాడు. ఇంగ్లీష్ బాక్సర్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. మొదటి రౌండ్‌లో ఐదుగురు న్యాయమూర్తులు పంఘల్‌కు 10 పాయింట్లు ఇచ్చారు. రెండవ రౌండ్‌లో పంఘల్ 5 మంది జడ్జీల నుంచి 10 పాయింట్లను పొందగలిగాడు. మూడో రౌండ్‌లో కూడా పంఘల్‌కు నలుగురు న్యాయమూర్తులు 10 పాయింట్లు అందించారు. ఈ విధంగా భారత బాక్సర్ 5-0 తేడాతో టైటిల్‌ను గెలుచుకున్నాడు.