CWG 2022: వెయింగ్ లిఫ్టింగ్‌లో అదరగొడుతోన్న మాజీ భారత బాక్సర్ కుమారుడు.. స్వర్ణంతో వెలుగులోకి..

జెరెమీ లాల్‌ రిన్నుంగ్‌ మొదట్లో తన తండ్రి అడుగుజాడలను అనుసరించాడు. కానీ, తరువాత అతని ఆటను మార్చుకుని, కామన్వెల్త్‌లో సత్తా చాటాడు.

CWG 2022: వెయింగ్ లిఫ్టింగ్‌లో అదరగొడుతోన్న మాజీ భారత బాక్సర్ కుమారుడు.. స్వర్ణంతో వెలుగులోకి..
022 Commonwealth Games Jeremy Lalrinnunga

Updated on: Jul 31, 2022 | 5:21 PM

19 ఏళ్ల యువకుడు కామన్వెల్త్ గేమ్స్ 2022 లో అద్భుతాలు చేశాడు. పురుషుల 67 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో జెరెమీ లాల్‌ రిన్నుంగ్‌ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడు జెరెమీ.. బర్మింగ్‌హామ్‌లో మొత్తం 300 కిలోల బరువును ఎత్తాడు. ఒకప్పుడు రింగ్‌లో పంచ్‌ల వర్షం కురిపించిన జెరెమీ వెయిట్‌లిఫ్టింగ్‌లోకి అడుగుపెట్టిన కథ చాలా ఆసక్తికరంగా ఉంది.

జెరెమీ తండ్రి, మాజీ జాతీయ ఛాంపియన్. జెరెమీ తండ్రి జూనియర్ నేషనల్ ఛాంపియన్ బాక్సర్. జెరెమీ, అతని నలుగురు సోదరులు కూడా వారి తండ్రి అడుగుజాడలను అనుసరించారు. బాక్సింగ్ రింగ్‌లోకి ప్రవేశించారు. అయితే అతను వెయిట్ లిఫ్టింగ్ చూసే వరకు జెరెమీని బాక్సర్ అని మాత్రమే పిలిచేవారు. కొంతకాలం క్రితం జెరెమీ ఒక ఇంటర్వ్యూలో, మా గ్రామంలో ఒక అకాడమీ ఉందని, అక్కడ కోచ్ వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ ఇస్తున్నారని చెప్పుకొచ్చాడు. నేను నా స్నేహితుల శిక్షణను చూశాను. బలం ఒక ఆటగా భావించాను. నాకు కూడా అది అవసరం అని తెలుసుకున్నానంటూ చెప్పుకొచ్చాడు.

2011లో మలుపు తిరిగిర కెరీర్..

ఇవి కూడా చదవండి

2011లో ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ట్రయల్స్‌కు ఎంపికైనప్పుడు జెరెమీ కెరీర్ మలుపు తిరిగింది. ఇది జెరెమీ ప్రొఫెషనల్ వెయిట్‌లిఫ్టింగ్ ప్రయాణానికి నాంది పలికింది. దీని తర్వాత, అతను 2016లో ప్రపంచ యూత్ ఛాంపియన్‌షిప్‌లో 56 కిలోల బరువు విభాగంలో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. మరుసటి ఏడాది ఇదే ఈవెంట్‌లో మరో రజతం సాధించాడు. జూనియర్ ఆసియా ఛాంపియన్‌షిప్ 2018లో జెరెమీ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. జెరెమీ 7 సంవత్సరాల వయస్సులో బాక్సింగ్ ప్రారంభించాడు. అతని తండ్రి 1988లో బాక్సింగ్ ప్రారంభించాడు. జెరెమీ తండ్రి ప్రకారం, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది అతని కల, కానీ, అతని కల నెరవేరలేదు. అందుకే తన కొడుకు బాక్సర్‌గా మారాలని అనుకున్నాడు.

ఫైనల్‌లో గట్టి పోటీ..

ఫైనల్‌లో జెరెమీకి గట్టిపోటీ ఎదురైంది. స్నాచ్‌లో 140 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 160 కిలోలు ఎత్తాడు. 293 కిలోలు ఎత్తి రజతం సాధించిన సమోవాకు చెందిన నెవో అతనికి గట్టి పోటీ ఇచ్చాడు. నెవో చివరి ప్రయత్నంలో 174 కిలోల బరువును ఎత్తలేకపోయాడు. దీని కారణంగా అతను రజతంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.