వావ్.. 6 బంతుల్లో 6 సిక్సర్లు..మ్యాజిక్ రిపీట్…

క్రికెట్‌ ఫీల్డ్‌లో అరుదైనదిగా భావించే ఆరు బంతుల్లో..ఆరు సిక్సర్ల ఫీట్ మరోసారి రిపీటయ్యింది. న్యూజిలాండ్ ప్లేయర్ కార్టర్ ఒకే ఓవర్‌లో వరసగా ఆరు సిక్సులు బాది ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశాడు. సూపర్ స్మాష్‌ టోర్నమెంట్‌లో ఈ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. తన టీం విజయానికి 30 బాల్స్‌లో 64 రన్స్ అవసరం అయిన దశలో లియో కార్టర్ ఊచకోత ప్రారంభించాడు.   కాంటర్బరీ కింగ్స్‌ తరుఫున ఆడుతోన్న కార్టర్,  నార్తన్ నైట్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న బాలర్ ఆంటోన్ […]

వావ్.. 6 బంతుల్లో 6 సిక్సర్లు..మ్యాజిక్ రిపీట్...
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 05, 2020 | 7:22 PM

క్రికెట్‌ ఫీల్డ్‌లో అరుదైనదిగా భావించే ఆరు బంతుల్లో..ఆరు సిక్సర్ల ఫీట్ మరోసారి రిపీటయ్యింది. న్యూజిలాండ్ ప్లేయర్ కార్టర్ ఒకే ఓవర్‌లో వరసగా ఆరు సిక్సులు బాది ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశాడు. సూపర్ స్మాష్‌ టోర్నమెంట్‌లో ఈ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. తన టీం విజయానికి 30 బాల్స్‌లో 64 రన్స్ అవసరం అయిన దశలో లియో కార్టర్ ఊచకోత ప్రారంభించాడు.   కాంటర్బరీ కింగ్స్‌ తరుఫున ఆడుతోన్న కార్టర్,  నార్తన్ నైట్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న బాలర్ ఆంటోన్ డేవ్చిచ్ వేసిన 16వ ఓవర్‌లో ఆరు బంతులను స్టాండ్స్‌కు పంపించాడు. 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, 220 పరుగుల టార్గెట్‌ని మరో 7 బంతుల మిగిలుండగానే సహచరులతో కలిసి ఖతం చేశాడు. గతంలో యూవీ కొట్టిన ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల మ్యాజిక్‌ని ఎవరూ మర్చిపోరు. వీరితో పాటు రవిశాస్త్రి, గ్యారీ సోబర్స్, గిబ్స్, హజ్రతుల్లా, రాస్ వైట్లీ కూడా ఈ ఫీట్‌ను సాధించారు.