Sourav Ganguly : పిచ్ పైనా..టీవీ స్క్రీన్ పైనా..దాదా స్టైలే వేరు..బిగ్ బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ
Sourav Ganguly : బెంగాలీ రియాలిటీ షో చరిత్రలో భారీ మార్పు చోటుచేసుకోబోతోంది. దాదాపు పదేళ్ల విరామం తర్వాత వస్తున్న బిగ్ బాస్ బంగ్లాకు టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ మహారాజ్ సౌరవ్ గంగూలీ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. జీ బంగ్లాలో సుమారు పదేళ్లకు పైగా దాదాగిరి షోతో ప్రేక్షకులను అలరించిన సౌరవ్ గంగూలీ, ఇప్పుడు ఆ షోకు గుడ్ బై చెప్పారు.

Sourav Ganguly : బెంగాలీ రియాలిటీ షో చరిత్రలో భారీ మార్పు చోటుచేసుకోబోతోంది. దాదాపు పదేళ్ల విరామం తర్వాత వస్తున్న బిగ్ బాస్ బంగ్లాకు టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ మహారాజ్ సౌరవ్ గంగూలీ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. జీ బంగ్లాలో సుమారు పదేళ్లకు పైగా దాదాగిరి షోతో ప్రేక్షకులను అలరించిన సౌరవ్ గంగూలీ, ఇప్పుడు ఆ షోకు గుడ్ బై చెప్పారు. తాజా సమాచారం ప్రకారం.. ఆయన స్టార్ జల్సా ఛానల్‌తో భారీ ఒప్పందం చేసుకున్నారు. నవంబర్ 2026 నుంచి బిగ్ బాస్ బంగ్లా సరికొత్త సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ షోకు సౌరవ్ గంగూలీ హోస్ట్‌గా వ్యవహరిస్తారని ఇప్పటికే అధికారిక ప్రకటనలు కూడా వచ్చాయి. 2013 మరియు 2016 తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం ఈ షో మళ్ళీ పట్టాలెక్కుతోంది.
భారీ రెమ్యునరేషన్.. రూ. 125 కోట్ల ఒప్పందం
సౌరవ్ గంగూలీ స్టార్ జల్సా ఛానల్‌తో నాలుగు సంవత్సరాల కాలానికి సుమారు రూ.125 కోట్ల భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. కేవలం బిగ్ బాస్ మాత్రమే కాకుండా, మరో సరికొత్త క్విజ్ షోకు కూడా ఆయన హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ రేంజ్ లో సౌరవ్ కు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు బెంగాలీ సినిమా రంగంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కంటెస్టెంట్లు ఎవరు? షూటింగ్ ఎప్పుడు?
ప్రస్తుతానికి బిగ్ బాస్ హౌస్ మేట్స్ సెలక్షన్ ప్రాసెస్ ముమ్మరంగా సాగుతోంది. తృణా సాహా, నీల్ భట్టాచార్య, సుదీప్త బెనర్జీ వంటి ప్రముఖ బెంగాలీ నటీనటుల పేర్లు వినిపిస్తున్నాయి. మొదట ఈ షో మార్చి 2026 లో ప్రారంభం అవుతుందని భావించినప్పటికీ, తాజా అప్‌డేట్స్ ప్రకారం నవంబర్ 2026 న లాంచ్ కానుంది. షో ప్రారంభానికి ఆరు నెలల ముందే దీనికి సంబంధించిన పనులు పూర్తి చేయాలని టీమ్ భావిస్తోంది.
బెంగాలీ టీవీ రంగంలో పెను మార్పు
జి బంగ్లాలో స రి గ మ ప, డాన్స్ బంగ్లా డాన్స్ వంటి షోలు ప్రైమ్ టైమ్ లో దూసుకుపోతుండగా, స్టార్ జల్సా ఇప్పుడు బిగ్ బాస్, సౌరవ్ గంగూలీ క్రేజ్ తో వాటికి చెక్ పెట్టాలని చూస్తోంది. దాదా హోస్టింగ్‌లో ఈ షో ఎలాంటి రేటింగ్‌లను సాధిస్తుందో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి
