ఏప్రిల్‌ 15న వరల్డ్ కప్ టీం ప్రకటన

ముంబై : ప్రపంచ కప్‌ కోసం భారత జట్టును ఏప్రిల్‌ 15న బీసీసీఐ ప్రకటించనుంది. ముంబైలో నిర్వహించే సమావేశంలో.. వరల్డ్ కప్‌ కోసం ఆడబోయే 15 మంది టీమిండియా ఆటగాళ్లను ప్రకటించనుంది. ఇప్పటికే ఎంపిక చేసిన 20 మందిలో 15 మంది ప్లేయర్లను ఫైనల్‌ చేయనుంది. ప్రపంచ కప్‌ కు ఆడబోయే జట్టులను ఏప్రిల్‌ 23లోగా ప్రకటించాలని ఐసీసీ తెలపడంతో.. ఈ మేరకు సెలక్షన్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ వరల్డ్ కప్‌ లో 10 […]

ఏప్రిల్‌ 15న వరల్డ్ కప్ టీం ప్రకటన

Edited By:

Updated on: Apr 08, 2019 | 4:49 PM

ముంబై : ప్రపంచ కప్‌ కోసం భారత జట్టును ఏప్రిల్‌ 15న బీసీసీఐ ప్రకటించనుంది. ముంబైలో నిర్వహించే సమావేశంలో.. వరల్డ్ కప్‌ కోసం ఆడబోయే 15 మంది టీమిండియా ఆటగాళ్లను ప్రకటించనుంది. ఇప్పటికే ఎంపిక చేసిన 20 మందిలో 15 మంది ప్లేయర్లను ఫైనల్‌ చేయనుంది. ప్రపంచ కప్‌ కు ఆడబోయే జట్టులను ఏప్రిల్‌ 23లోగా ప్రకటించాలని ఐసీసీ తెలపడంతో.. ఈ మేరకు సెలక్షన్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఐసీసీ వరల్డ్ కప్‌ లో 10 దేశాలు పాల్గొననున్నాయి. మే 30 గురువారం రోజున ఓవల్‌ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు తొలి మ్యాచ్‌ ఇంగ్లాండ్‌, సౌతాఫ్రికా మధ్య జరగనుంది. జూన్‌ 5న సౌతాఫ్రికాతో భారత్‌ తొలిసారిగా తలపడనుంది. అయితే టీమిండియా నాలుగో స్థానంలో వచ్చే బ్యాట్స్‌మన్, ఆల్‌రౌండర్, స్పిన్నర్లు ఎంతమంది ఉండాలన్నదానిపైనే ప్రధానంగా కమిటీ దృష్టి సారించనుంది. ప్రధానంగా మిడిలార్డర్‌ 4వ స్థానంలో దినేష్ కార్తీక్‌ లేదా రిషబ్‌ పంత్‌ ను తీసుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆల్ రౌండర్‌ విషయంలో రవీంద్ర జడేజా గానీ విజయ్‌ శంకర్‌ ను గానీ తీసుకునే అవకాశం ఉంది. అయితే భారత జట్టు కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీలను సంప్రదించిన తర్వాతే బీసీసీఐ జట్టు ప్రకటన వెల్లడించనుంది.