Womens Cricket: కామన్వెల్త్‌ గేమ్స్‌ క్రికెట్‌ షెడ్యూల్‌ ఖరారు.. భారత్‌ మహిళల జట్టు తొలి ప్రత్యర్థి ఎవరంటే..

వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా జరగనున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లోతొలిసారిగా క్రికెట్‌కు చోటు కల్పించిన సంగతి తెలిసిందే..

Womens Cricket: కామన్వెల్త్‌ గేమ్స్‌ క్రికెట్‌ షెడ్యూల్‌ ఖరారు.. భారత్‌ మహిళల జట్టు తొలి ప్రత్యర్థి ఎవరంటే..
Follow us

|

Updated on: Nov 13, 2021 | 12:04 PM

వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా జరగనున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లోతొలిసారిగా క్రికెట్‌కు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి గేమ్స్‌లో మహిళల విభాగంలో క్రికెట్‌ పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కామన్వెల్త్‌ క్రికెట్‌ పోటీలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది. జులై 29 నుంచి ఆగస్టు 7 వరకు క్రికెట్‌ ఈవెంట్స్‌ జరగనున్నాయి. భారత మహిళల జట్టు తన మొదటి మ్యాచ్‌లో పటిష్ఠమైన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. మహిళల క్రికెట్‌ ఈవెంట్స్‌కు సంబంధించి మొత్తం 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి.

జులై 31న దాయాది దేశంతో.. గ్రూప్‌- ఎలో భారత్‌, పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా, బార్బడోస్‌ ఉండగా.. గ్రూప్‌- బిలో ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, క్వాలిఫయర్‌ జట్లు ఉండనున్నాయి. మొత్తం 9 రోజుల పాటు ఈ క్రికెట్‌ పోటీలు జరగనున్నాయి. మ్యాచ్‌లన్నీ టీ- 20 ఫార్మాట్‌లో ఎడ్జ్‌బాస్టన్‌ వేదిక గానే జరుగనున్నాయి. 29న ఆస్ట్రేలియా మ్యాచ్‌ తర్వాత భారత్‌ 31న పాకిస్తాన్తో తలపడనుంది. అనంతరం ఆగస్టు 3న బార్బడోస్‌తో చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది. రెండు గ్రూపులలో టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్‌ మ్యాచ్‌లు ఆగస్టు6న, జరుగుతాయి. ఇందులో గెలిచిన జట్లు ఆగస్టు7న బంగారు పతకం కోసం, అదే రోజు సెమీస్‌లో ఓడిన జట్లు కాంస్య పతకం కోసం పోటీ పడనున్నాయి.

Also Read:

T20 World Cup 2021 Final: ఆసక్తికరంగా పొరుగు దేశాల మధ్య పోరు.. తొలి విజేతగా నిలిచేది ఎవరో?

India Vs New Zealand: 24 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన భారత ఆటగాడు.. ప్రస్తుతం కివీస్ సిరీస్‌‌లో సత్తా చాటేందుకు రెడీ..!

India vs New Zealand: హర్దిక్ పాండ్యా కంటే బెస్ట్ ఆల్‌రౌండర్‌.. ఎలా మరిచారంటూ బీసీసీఐ సెలక్టర్లపై ఫైరవుతోన్న నెటిజన్లు