ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్-2023లో భారత్ తొలి స్వర్ణం గెలుచుకుంది. కజకిస్థాన్‌లోని అస్తానాలో జరుగుతున్న ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో యంగ్ గ్రాప్లర్ అమన్ సెహ్రావత్ గురువారం బంగారు పతకం సాధించాడు. 57 కేజీల విభాగంలో కిర్గిస్థాన్‌కు చెందిన అల్మాజ్ స్మాన్‌బెకోవ్‌ను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఛాంపియన్‌షిప్ ఫైనల్లో 9-4 తేడాతో స్మాన్‌బెకోవ్‌పై సెహ్రావత్ గెలుపొందడం విశేషం. తాజాగా సెహ్రావత్ స్వర్ణంతో కలిపి భారత్ ఇప్పటివరకు 12 పతకాలు సాధించింది.
క్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన రికుటో అరాయ్‌పై 7-1 తేడాతో మట్టికరిపించి సెహ్రావత్ సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇక సెమీఫైనల్లోనూ అదే దూకుడు కనబరచి చైనాకు చుక్కలు చూపించాడు. మొదటి నుంచి తన ఆటతీరుతో అందరి మన్ననలు పొందుతోన్న సెహ్రావత్ ఫైనల్‌లో కిర్గిస్థాన్‌తో తలపడ్డాడు. ఫిబ్రవరిలో జరిగిన జాగ్రెబ్ ఓపెన్‌లో సెహ్రావత్ కాంస్యం సాధించాడు. తాజాగా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో జమచేసుకున్నాడు. సెహ్రావత్ గతేడాది U-23 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. కాగా నిన్న మరో ఇద్దరు భారతీయ రెజ్లర్లు కాంస్య పతక రౌండ్‌కు చేరుకున్నారు. దీపక్ కుక్నా (79 కేజీలు), దీపక్ నెహ్రా (97 కేజీలు) సెమీ ఫైనల్స్‌లో ఓటమిపాలవడంతో కాంస్య పతకాల రౌండ్‌కు చేరుకున్నారు.
Asian champion at 57kg ➡️ Aman AMAN ??.@DairyMilkIn ?? |#CheerForAllSports | #CheerForWrestling | #CadburyDairyMilk | #KuchAchhaHoJaayeKuchMeethaHoJaaye | #WrestleAstana pic.twitter.com/dCZmB8NPQv
— United World Wrestling (@wrestling) April 13, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి.