AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ క్రికెటర్‌కు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీచేసిన కోర్టు!

టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. షమీకి, అతడి సోదరుడు హసీద్ అహ్మద్‌కు గృహహింస కేసులో వెస్ట్ బెంగాల్‌లోని అలిపోర్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. 15 రోజుల లోపు కోర్టుముందు లొంగిపోవాలని స్పష్టం చేసింది. పలువురు అమ్మాయిలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తన భర్త, అతడి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని షమీ భార్య హసీన్ జహాన్ గతంలో కేసు పెట్టింది. గత ఏడాది ఐపీఎల్‌కు ముందు గృహహింస కేసు […]

ఆ క్రికెటర్‌కు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీచేసిన కోర్టు!
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 02, 2019 | 8:05 PM

Share

టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. షమీకి, అతడి సోదరుడు హసీద్ అహ్మద్‌కు గృహహింస కేసులో వెస్ట్ బెంగాల్‌లోని అలిపోర్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. 15 రోజుల లోపు కోర్టుముందు లొంగిపోవాలని స్పష్టం చేసింది. పలువురు అమ్మాయిలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తన భర్త, అతడి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని షమీ భార్య హసీన్ జహాన్ గతంలో కేసు పెట్టింది. గత ఏడాది ఐపీఎల్‌కు ముందు గృహహింస కేసు కూడా పెట్టింది. దాంతో ఐపీసీ 498ఏ, 354ఏ సెక్షన్ల కింద కోల్ కతా పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు.

ఇక ఏప్రిల్‌లో అమ్రోహా(యూపీ)లోని షమీ ఇంటికి వెళ్లిన జహాన్..అత్తారింట్లో హంగామా చేసింది. షమీ తల్లిదండ్రులతో గొడవకు దిగింది. కూతురితో సహా వచ్చిన హసీన్ తనను తాను ఒక గదిలో నిర్బంధించుకుంది. షమి పేరెంట్స్ పోలీసులకు సమాచారం అందించడంతో ఆమెను అరెస్టు చేశారు. అనంతరం బెయిల్ పై విడుదల చేశారు. కాగా, ప్రస్తుతం వెస్టిండీస్‌లో ఉన్న షమి..వెస్టిండీస్-ఇండియా టెస్ట్ సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సమయంలో అరెస్ట్ వారెంట్ జారీకావడం చర్చనీయాంశమైంది.

Follow Us
హైదరాబాద్‌లో సదర్ సమ్మేళనంలో విషాదం.. దున్నపోతును ఆడిస్తూ..
హైదరాబాద్‌లో సదర్ సమ్మేళనంలో విషాదం.. దున్నపోతును ఆడిస్తూ..
వైట్‌హౌస్‌ వద్ద హైటెన్షన్.. ట్రంప్‌ ఉండగానే 2 భద్రతా ఉల్లంఘనలు
వైట్‌హౌస్‌ వద్ద హైటెన్షన్.. ట్రంప్‌ ఉండగానే 2 భద్రతా ఉల్లంఘనలు
గోవర్ధన పర్వతం ఎందుకు కుంచించుకుపోతోంది? పులస్త్య మహర్షి శాపం..
గోవర్ధన పర్వతం ఎందుకు కుంచించుకుపోతోంది? పులస్త్య మహర్షి శాపం..
దీపావళి కానుకగా లేఆఫ్ నోటీసు.. షాకైన ఉద్యోగి!
దీపావళి కానుకగా లేఆఫ్ నోటీసు.. షాకైన ఉద్యోగి!
రోజూ ఉలవలు తింటే.. ఇమ్యూనిటీ డబుల్ .. గుర్రంలా పరుగులు తీస్తారు
రోజూ ఉలవలు తింటే.. ఇమ్యూనిటీ డబుల్ .. గుర్రంలా పరుగులు తీస్తారు
దంతాలలో క్యావిటీస్ రావడానికి కారణం ఏంటో తెలుసా..? ఏ ఖనిజం లోపం
దంతాలలో క్యావిటీస్ రావడానికి కారణం ఏంటో తెలుసా..? ఏ ఖనిజం లోపం
అర్జున్‌ను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. పొలిమేర 3 గ్లింప్స్ రిలీజ్
అర్జున్‌ను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. పొలిమేర 3 గ్లింప్స్ రిలీజ్
ఉసిరికాయ ఎప్పుడు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలు, తినే సరైన విధానం ఇదే!
ఉసిరికాయ ఎప్పుడు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలు, తినే సరైన విధానం ఇదే!
చికెన్, మటన్ కన్నా బలమైన ఫుడ్ ఇదే.. గుప్పెడు తింటే చచ్చుబడ్డ నరాల
చికెన్, మటన్ కన్నా బలమైన ఫుడ్ ఇదే.. గుప్పెడు తింటే చచ్చుబడ్డ నరాల
గోవర్ధన పూజ రోజు ఈ 4 దానాలు చేస్తే ఎంతో పుణ్యఫలం.. సుఖసంతోషాలు..
గోవర్ధన పూజ రోజు ఈ 4 దానాలు చేస్తే ఎంతో పుణ్యఫలం.. సుఖసంతోషాలు..