Armaan Bhatia: అదరగొట్టిన అర్మాన్ భాటియా..ఇండియా మాస్టర్స్ పికిల్ బాల్ సింగిల్స్ టైటిల్ కైవసం

|

Oct 27, 2024 | 10:00 PM

25 ఏళ్ల అర్మాన్ భాటియా అదరగొట్టాడు. న్యూఢిల్లీ వేదికగా జరుగుతోన్న పిడబ్ల్యుఆర్ డియుపిఆర్ ఇండియా మాస్టర్స్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌ సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. దీంతో అతనికి అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Armaan Bhatia: అదరగొట్టిన అర్మాన్ భాటియా..ఇండియా మాస్టర్స్ పికిల్ బాల్ సింగిల్స్ టైటిల్ కైవసం
Armaan Bhatia
Follow us on

భారత అథ్లెట్ అర్మాన్ భాటియా మళ్లీ అదరగొట్టాడు. న్యూఢిల్లీ వేదికగా జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక PWR DUPR ఇండియా మాస్టర్స్ పికిల్ బాల్ ఛాంపియన్‌షిప్‌ టైటిల్ ను అర్మాన్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం (అక్టోబర్ 27) ఉత్కంఠభరితంగా జరిగిన పురుషులప్రో సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ లో 25 ఏళ్ల అర్మాన్ అమెరికా టాప్ సీడ్ ప్లేయర్ డస్టీ బోయర్‌ను 8-11, 11-9, 11-8 స్కోర్‌తో చిత్తు చేశాడు. భాటియా గేమ్ ప్రారంభం నుంచే ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. దూకుడుగా ఆడి 3-0తో ఆధిక్యంలో నిలిచాడు. అయితే బోయర్ కూడా వెనక్కు తగ్గలేదు. భారత్ ప్లేయర్ దూకుడుకు బ్రేకులు వేస్తూ 3-3 తో గేమ్ ను సమం చేశాడు. ఆ తర్వాత కూడా బోయర్ దూకుడు చూపిస్తూ మొదటి గేమ్ ను గెల్చుకున్నాడు. అయితే ధైర్యం కోల్పోని అర్మాన్ మరింత జాగ్రత్త పడ్డాడు. పట్టుదలతో రెండో గేమ్ ను ఫినిష్ చేశాడు. బోయర్ తప్పులను సద్వినియోగం చేసుకుంటూ 11-9తో మ్యాచ్‌ను సమం చేశాడు. ఇక నిర్ణయాత్మకమైన మూడో గేమ్ లో కొదమ సింహాల్లా తలపడ్డారు అర్మాన్, బోయర్. ఒకానొక దశలో బోయర్ పూర్తి ఆధిక్యంలోకి వెళ్లినా భాటియా పోరాట పటిమను ప్రదర్శించాడు. చివరకు 11-8 తో మూడో గేమ్ తో పాటు మ్యాచ్ ను గెల్చుకున్నాడు.

 

ఇవి కూడా చదవండి

అర్మాన్ పికిల్‌బాల్ ప్రయాణం

గత సెప్టెంబర్‌లో పికిల్‌బాల్‌లోకి అడుగుపెట్టాడు అర్మాన్ భాటియా. అతి తక్కువ వ్యవధిలోనే ఆటలో మంచి నైపుణ్యం సాధించాడు. ఇప్పుడు ప్రతిష్ఠాత్మక PWR DUPR ఇండియా మాస్టర్స్ పికిల్ బాల్ ఛాంపియన్‌షిప్‌ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. PWR DUPR ఇండియా మాస్టర్స్, PWR700 ఈవెంట్‌ను న్యూ ఢిల్లీలో నిర్వహిస్తోంది. ఈ టోర్నమెంట్ 52 వారాల పాటు చెల్లుబాటు అయ్యే 700 ర్యాంకింగ్ పాయింట్‌లను సంపాదించడంలో ఆటగాళ్లకు సహాయపడుతుంది. ఈ పాయింట్లు భవిష్యత్తులో జరిగే ప్రపంచ పోటీలకు సీడింగ్, అర్హతలో కీలకం కానున్నాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..