అంబటి రాయుడు ఇండియా టీంలోకి రీ ఎంట్రీ?

టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు మరో సంచలనానికి రెడీ అయ్యాడు. ఆవేశంలో ఇచ్చిన తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా ఇప్పటికే అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం రాయుడు టీఎన్‌సీఏ వన్డే లీగ్‌లో గ్రాండ్‌శ్లామ్‌ జట్టుకు ఆడుతున్నాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ భారత్‌ తరుఫున టెస్ట్ మరియు ఐపిఎల్‌ ఫార్మాట్లలో రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపాడు. జులైలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు […]

  • Ram Naramaneni
  • Publish Date - 8:31 pm, Fri, 23 August 19
అంబటి రాయుడు ఇండియా టీంలోకి రీ ఎంట్రీ?
Ambati Rayudu hints at making a comeback to white-ball cricket for India

టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు మరో సంచలనానికి రెడీ అయ్యాడు. ఆవేశంలో ఇచ్చిన తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా ఇప్పటికే అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం రాయుడు టీఎన్‌సీఏ వన్డే లీగ్‌లో గ్రాండ్‌శ్లామ్‌ జట్టుకు ఆడుతున్నాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ భారత్‌ తరుఫున టెస్ట్ మరియు ఐపిఎల్‌ ఫార్మాట్లలో రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపాడు. జులైలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు తాజా నిర్ణయంతో వార్తల్లో నిలిచాడు.

రెండేళ్లు టీమిండియా తరుపున నిలకడగా ఆడిన రాయుడిని సెలక్షన్‌ కమిటీ వరల్డ్ కప్‌కు ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో మూడు కోణాల్లో ఉపయోగపడతాడని విజయ్‌ శంకర్‌ను తీసుకుంది. దీంతో ప్రపంచకప్‌ను వీక్షించేందుకు ‘3డీ’ కళ్లద్దాలు కొనుగోలు చేస్తానని ట్వీట్‌ చేశాడు. ఇది చర్చనీయాంశంగా మారింది. టోర్నీలో శిఖర్‌ ధావన్‌, శంకర్‌ గాయపడ్డా బ్యాకప్‌గా ఉన్న అతడిని ఎంపిక చేయలేదు. పంత్‌, మయాంక్‌ను ఇంగ్లాండ్‌కు పిలిపించారు. భావోద్వేగానికి గురైన రాయుడు చివరికి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించాడు.