Wrestlers Protest: రెజ్లర్స్ పోరాటానికి పెరుగుతున్న మద్దతు.. సపోర్ట్ ప్రకటించిన నటి పూనమ్ కౌర్
వీరికి నటి పూనమ్ కౌర్ సైతం మద్దతు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో విడుదల చేశారు. ‘రెజ్లింగ్ లో భారత కీర్తిని ప్రపంచానికి చాటి మనల్ని గర్వపడేలా చేసిన రెజ్లర్లు ఇప్పుడు వారి భద్రత కోసం పోరాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కుస్తీవీరుల పోరాటం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. భారత దేశ కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ వేదికలపై రెపరెపలాడించిన మల్లయోధులు నేడు న్యాయం కోసం రోడ్డెక్కి రోదిస్తున్నారు. అయితే రెజ్లర్ల పోరాటం ఫలిస్తోంది. వారికి మద్దతు పెరుగుతోంది. తమకు న్యాయం చేయాలంటూ జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగిన రెజ్లర్లకు పలువురు ప్రముకులు బాసటగా నిలుస్తున్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా గడిచిన ఆరు రోజులుగా రెజ్లర్లు సాగిస్తున్న పోరుకు మద్దతు పెరుగుతోంది. దేశవ్యాప్తంగా అగ్రశ్రేణి ఆటగాళ్లు, మాజీలు వారి పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయాలని, అతడిపై మేరీ కోమ్ ఆధ్వర్యంలోని కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను బహిర్గతం చేయాలని కోరుతూ రెజ్లర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) April 28, 2023
ఇప్పుడు వీరికి నటి పూనమ్ కౌర్ సైతం మద్దతు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో విడుదల చేశారు. ‘రెజ్లింగ్ లో భారత కీర్తిని ప్రపంచానికి చాటి మనల్ని గర్వపడేలా చేసిన రెజ్లర్లు ఇప్పుడు వారి భద్రత కోసం పోరాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెజ్లర్లకు కపిల్ దేవ్ తోసహా ఎందరో మద్దతిచ్చారని… తానూ మద్దతిస్తున్నానని పూనమ్ కౌర్ తెలిపారు.
మరోవైపు రెజ్లర్ల పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నట్లు ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపారు. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం పిటిషన్‌పై విచారణ జరిపింది. ఇక బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేసేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని రెజ్లర్లు అంటున్నారు.