ధోనీ​కి చేనేత కార్మికుడి స్పెషల్ గిఫ్ట్

ఆగస్టు 15న ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించిన ఎంఎస్​ ధోనీ..ఫ్యాన్స్ అంద‌ర్నీ షాక్‌కు గురిచేసిన సంగ‌తి తెలిసిందే.

ధోనీ​కి చేనేత కార్మికుడి స్పెషల్ గిఫ్ట్
Follow us

|

Updated on: Aug 27, 2020 | 8:25 AM

ఆగస్టు 15న ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించిన ఎంఎస్​ ధోనీ..ఫ్యాన్స్ అంద‌ర్నీ షాక్‌కు గురిచేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక‌మంది తాజా, మాజీ క్రికెటర్లు ధోనీతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అత‌డి ఆట‌తీరును, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను కొనియాడారు. ఇక అభిమానులు కూడా 16 ఏళ్ల పాటు మ‌హీ భారత క్రికెట్ జ‌ట్టుకు చేసిన సేవ‌లను గుర్తుచేసుకున్నారు.‌

కేవ‌లం​ ధోనీ ఆటతీరుకు మాత్ర‌మే కాదు అతడి వ్యక్తిత్వానికి కూడా అభిమానులు ఎక్కువ‌. వారందరూ అతడిని ‘కెప్టెన్​ కూల్’​గా పిలుచుకుంటారు. అయితే తమిళనాడులోని అభిమానులు ఇంకాస్త స్పెష‌ల్. ధోనీని అన్నలా భావించి ‘తలా’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఈ క్ర‌మంలో తమిళనాడులోని చెన్నిమలైకు చెందిన అప్పూసామి అనే చేనేత కార్మికుడు ధోనీపై త‌న‌కు ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. ధోనీ, తన కుమార్తె జీవా ఫోటోల‌ను ఓ దుప్పటిపై వచ్చేలా మగ్గంపై నేశాడు. దానిపై ‘తలా’ అని ఆంగ్లంలో కనిపించే విధంగా రూపొందించాడు. గతంలో ఎంతోమంది సెల‌బ్రిటీల‌ చిత్రాలను దుప్పట్లపై డిజైన్​ చేసి గుర్తింపు పొందాడు అప్పూస్వామి. ఈ దుప్పటి త‌యారుచేయ‌డానికి దాదాపు 15 రోజుల స‌మ‌యం పట్టిందని తెలిపాడు. ధోనీ ప్రస్తుతం ఐపీఎల్​ కోసం యూఏఈ వెళ్లగా.. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత అత‌డిని కలిసి ఆ కళాఖండాన్ని స్వయంగా తానే అందిస్తానని అప్పూసామి తెలిపాడు.

Also Read :

ఇంట్లో నిద్ర‌పోతున్న ముగ్గురు చిన్నారుల‌ను కాటేసిన క‌ట్ల‌పాము

ప్రధానికి సీఎం జగన్ లేఖ, ఈ అంశం గురించే

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!