AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెస్సీ కోసం భారత ఫుట్‌బాల్‌ క్లబ్‌ల ఉబలాటం!

అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ బార్సిలోనా క్లబ్‌ను వీడుతున్నట్టు ప్రకటించిన మరుక్షణం నుంచే అభిమానుల ఆగ్రహం మొదలయ్యింది. బార్సిలోనాను వదిలి వెళ్లకంటూ మెస్సీని ప్రాధేయపడుతున్నారు.. సుమారు రెండు దశాబ్దాల పాటు బార్సిలోనా క్లబ్‌కు ఆడిన మెస్సీ అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తూ జట్టును వీడుతున్నట్టు తెలిపాడు. మరోవైపు మెస్సీని తమ జట్టులో చేర్చుకునేందుకు భారత ఫుట్‌బాల్‌ క్లబ్‌లు తెగ ఆసక్తి కనబరుస్తున్నాయి.

మెస్సీ కోసం భారత ఫుట్‌బాల్‌ క్లబ్‌ల ఉబలాటం!
Balu
|

Updated on: Aug 26, 2020 | 7:03 PM

Share

అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ బార్సిలోనా క్లబ్‌ను వీడుతున్నట్టు ప్రకటించిన మరుక్షణం నుంచే అభిమానుల ఆగ్రహం మొదలయ్యింది.. క్లబ్‌ ప్రెసిడెంట్‌ జోసెప్‌ మారియా తక్షణం రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు మెస్సీ అభిమానులు.. మెస్సీ బార్సిలోనా క్లబ్‌ వదిలేయడానికి పరోక్షంగా క్లబ్‌ అధ్యక్షుడే కారణమంటూ దుయ్యపడుతున్నారు.. బార్సిలోనాను వదిలి వెళ్లకంటూ మెస్సీని ప్రాధేయపడుతున్నారు.. సుమారు రెండు దశాబ్దాల పాటు బార్సిలోనా క్లబ్‌కు ఆడిన మెస్సీ అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తూ జట్టును వీడుతున్నట్టు తెలిపాడు. 11 రోజుల క్రితం చాంపియన్స్‌లీగ్‌లో ఎదురైన ఘోరపరాజయంతోనే మెస్సీ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.

బార్సిలోనా క్లబ్‌కు చెందిన మాసియా యూత్ అకాడమీలో 2001లో చెరిన మెస్సీ.. 2003లో క్లబ్ తరఫున అరంగేట్రం చేశాడు. అప్పుడు మెస్సీ వయసు 16 ఏళ్లే! అప్పటి నుంచి బార్సిలోనాకు మొత్తం 34 టైటిళ్లు అందించాడు. క్లబ్‌లోనే అత్యధిక వ్యక్తిగత రికార్డు ఉన్న ఆటగాడు. క్లబ్ తరపున 731 మ్యాచ్‌లు ఆడి 634 గోల్స్ చేశాడు. ఇంతటి ప్రతిభావంతుడిని బార్సిలోనా క్లబ్‌ వదులుకున్నదంటే అది ఆ క్లబ్‌ దురదృష్టమే అనుకోవాలి.. మరోవైపు మెస్సీని తమ జట్టులో చేర్చుకునేందుకు భారత ఫుట్‌బాల్‌ క్లబ్‌లు తెగ ఆసక్తి కనబరుస్తున్నాయి.. మెస్సీ పారితోషికాన్ని మోసేటంత సామర్థ్యం మన క్లబ్‌లకు ఉన్నాయో లేదో తెలియదు కానీ.. ఆయన ఆడితే బాగుండనేది భారత అభిమానుల కోరిక. బార్సిలోనాను వీడుతున్నట్లు మెస్సీ ప్రకటించగానే స్టార్‌ ఫుట్‌బాలర్‌ను తమ జట్టులో చేర్చుకునేందుకు చాలా క్లబ్‌లు ముందుకొచ్చాయి. దేశీయ ఫుట్‌బాల్ టోర్నీ ఇండియ‌న్ సూప‌ర్ లీగ్ (ఐఎస్ఎల్‌)కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది కాబట్టి మెస్సీ కూడా ఊ కొడతారేమో చూడాలి!

రైతులకు సర్కార్ గుడ్ న్యూస్.. అకౌంట్లలో డబ్బు జమ..
రైతులకు సర్కార్ గుడ్ న్యూస్.. అకౌంట్లలో డబ్బు జమ..
టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదు..కొత్త వ్యవస్థ.. అదేంటంటే..
టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదు..కొత్త వ్యవస్థ.. అదేంటంటే..
భయపెడుతోన్న వాతావరణ శాఖ.. గడపదాటాలంటే ప్రజల్లో వణుకు..
భయపెడుతోన్న వాతావరణ శాఖ.. గడపదాటాలంటే ప్రజల్లో వణుకు..
18 ఏళ్లకే ఇండస్ట్రీలో సంచలనం.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుంది..
18 ఏళ్లకే ఇండస్ట్రీలో సంచలనం.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుంది..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ