తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ..

భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి కానున్నాడు. తాను గర్భవతినని అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపింది.

తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ..
Ravi Kiran

|

Aug 27, 2020 | 12:14 PM

భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. తాను గర్భవతినని అనుష్క శర్మ ఇన్‌స్టాలో తెలిపడమే కాకుండా విరాట్ కోహ్లీతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. ”ఆపై, జనవరి 2021కి మేము ముగ్గురం కాబోతున్నాం” అని రాసింది. ఇక ఇదే ఫోటోను విరాట్ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. దీనితో వీరిద్దరికి అటు సినీ ప్రముఖులు, ఇటు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, కొద్దిరోజుల క్రితమే టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తండ్రయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2020 కోసం యూఏఈ వెళ్ళాడు.

కాగా, 2017 డిసెంబర్‌ 11న వీరి వివాహం జరిగింది. క్రికెట్‌లో విరాట్‌కోహ్లీకి అంతర్జాతీయ స్థాయిలో కోట్లాది మంది అభిమానులున్నారు, ఇటు బాలీవుడ్‌ నటి అయిన అనుష్కశర్మకు కూడా ఇంటర్నేషన్‌ స్థాయిలో ఫ్యాన్స్‌ ఉన్నారు. దీంతో విరుష్క జోడీ గుడ్‌ న్యూస్‌ చెప్పడంతో ఈ న్యూస్‌ కాస్త వైరల్‌గా మారింది. 2021 జనవరిలో వీరి ఫ్యామిలీలోకి మూడో వ్యక్తి ఎంటరయ్యే అవకాశం ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి సంబంధించిన పిక్‌ కనిపించగానే లైక్‌ల వర్షం కురుస్తోంది. అటు బాలీవుడ్‌ నటీనటులతో పాటు సెలబ్రెటీస్‌ వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఐపిఎల్‌ టోర్నీ కోసం ఇటీవలే దుబాయ్‌ వెళ్లాడు విరాట్‌ కోహ్లీ.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu