Hardik Pandya: హార్దిక్ పాండ్యా లైఫ్ స్టైల్ మాములుగా లేదుగా.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఒక్కోక్కరిది ఒక్కో లైఫ్ స్టైల్.. అందులో ప్రముఖుల లైఫ్ స్టైల్స్ అయితే మరీ భిన్నంగా ఉంటాయి. రాజకీయ నాయకులైదేతే ఒక స్టైల్, స్పోర్ట్స్ పర్సన్స్ అయితే మరో స్టైల్, బిజినెస్ మ్యాన్స్ అయితే మరో స్టైల్..

Hardik Pandya: హార్దిక్ పాండ్యా లైఫ్ స్టైల్ మాములుగా లేదుగా.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Hardik Pandya
Follow us
Amarnadh Daneti

|

Updated on: Aug 24, 2022 | 6:38 PM

Hardik Pandya: ఒక్కోక్కరిది ఒక్కో లైఫ్ స్టైల్.. అందులో ప్రముఖుల లైఫ్ స్టైల్స్ అయితే మరీ భిన్నంగా ఉంటాయి. రాజకీయ నాయకులైదేతే ఒక స్టైల్, స్పోర్ట్స్ పర్సన్స్ అయితే మరో స్టైల్, బిజినెస్ మ్యాన్స్ అయితే మరో స్టైల్.. అయితే ఒక్కోక్కరి దినచర్య ఒక్కోలా ప్రారంభం అవుతుంది. పైకి కనబడే వ్యక్తిని బట్టి వారి లైఫ్ ఎలా సాగుతుందో అంచనా వేయడం కష్టం. కొంతమంది ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో గడపడానికి అంతే ప్రిఫరెన్స్ ఇస్తారు. మరికొంతమంది తమ బిజీ లైఫ్ తో ఫ్యామిలీ లైఫ్ కు అంతగా ప్రయారిటీ ఇవ్వరు. కాని కొంతమంది ప్రముఖుల దినచర్య తెలుసుకుంటే మాత్రం భలే సరదాగా ఉంటుంది. ఏంది ఇది నిజమేనా అనిపిస్తుంది. అలాంటిదే ప్రముఖ క్రికెటర్ టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవల తన ప్రాక్టీస్, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నాడు. తాజాగా తాను ఉదయం లేచిన నుంచి పడుకునే వరకు తన దినచర్య ఎలా ఉంటుందో వివరించే ఓ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఈవీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విలాసవంతమైన జీవితం గడపడానికి ఎక్కువ ఇష్టపడతాడు. గ్రౌండ్ లో క్రికెటర్ గా రాణించడానికి ఎంత కష్టపడతాడో.. బయట తన లైఫ్ ని అదే రేంజ్ లో ఎంజాయ్ చేస్తాడట. తన ఒకరోజు లగ్జరీ లైఫ్ ఎలా ఉంటుందో చూడాలనుకునే తన అభిమానుల కోసం హార్దిక్ పాండ్యా ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేశాడు. ఆసియా కప్ కోసం రెడీ అవుతున్న హార్దిక్ పాండ్యా ఓవైపు మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు ఫ్యామీలోతోనూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఉదయమే తన ప్రైవేట్ జెట్ ఎక్కడంతో మొదలైన అతడి దినచర్య.. రాత్రి అదే జెట్ దిగడంతో ఎలా ముగుస్తుందో వీడియో షేర్ చేశాడు. తన ప్రయివేట్ జెట్ తో పాటు.. లగ్జరీ కార్లు, ఇంటిని చూపించాడు హార్దిక్ పాండ్యా. తన తల్లిని హగ్ చేసుకోవడం, కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం, గ్రౌండ్ లో ప్రాక్టీస్ ఇలా తాను చేసే పనులన్నింటిని వీడియోలో చూపించాడు ఈ టీమిండియా క్రికెటర్. ‘ఎ డే ఇన్ మై లైఫ్’ క్యాప్షన్ తో తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో హార్దిక్ పాండ్యా ఈవీడియోను పంచుకున్నాడు. ఈరీల్ తన అభిమానులను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. వీడియో పోస్టు చేసిన గంటల్లోనే లక్షలాది లైక్స్ వచ్చాయి.

ఇవి కూడా చదవండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?