T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ మ్యాచుల షెడ్యూల్ విడుదల.. భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..
2024 పురుషుల టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదలైంది. స్టార్ స్పోర్ట్స్ తన ప్రసార హక్కులను దక్కించుకున్నట్లు శుక్రవారం తెలిపింది. టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం, 2024 పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో మార్క్యూ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 9న జరుగనుంది. న్యూయార్క్‌లోని ఐసెన్‌హోవర్ పార్క్ ఈ మ్యాచ్‌కు వేదికైంది.

2024 పురుషుల టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదలైంది. స్టార్ స్పోర్ట్స్ తన ప్రసార హక్కులను దక్కించుకున్నట్లు శుక్రవారం తెలిపింది. టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం, 2024 పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో మార్క్యూ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 9న జరుగనుంది. న్యూయార్క్‌లోని ఐసెన్‌హోవర్ పార్క్ ఈ మ్యాచ్‌కు వేదికైంది. భారత్ తమ గ్రూప్ మ్యాచ్‌లలో మొదటి మూడు మ్యాచ్‌లను న్యూయార్క్‌లో, నాల్గవ మ్యాచ్‌ని ఫ్లోరిడాలో ఆడనుంది. జూన్ 8న బార్బడోస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాతో తలపడనుంది.
యూఎస్ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ జూన్ 1న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో యూఎస్ఏ.. కెనడాతో తలపడుతుంది. అలాగే జూన్ 29న బార్బడోస్‌లో జరిగే ఫైనల్‌తో ఈ టోర్నమెంట్ ముగుస్తుంది. సెమీ ఫైనల్స్ జూన్ 26న గయానాలో, జూన్ 27న ట్రినిడాడ్‌లో జరగనున్నాయి. 55 మ్యాచ్‌లు వెస్టిండీస్‌లోని ఆరు వేదికలపై నిర్వహించగా యూఎస్ఏలో మూడు వేదికలు ఈ మ్యాచులకు ఆథిత్యం ఇవ్వనున్నాయి.
2024 టీ20 ప్రపంచ కప్ గ్రూపులు
- గ్రూప్ A : ఇండియా, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ
- గ్రూప్ B : ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్
- గ్రూప్ సి : న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పాపువా న్యూ గినియా
- గ్రూప్ D : దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్
భారత్ జూన్ 5న ఐర్లాండ్‌తోపాటు 9న పాకిస్థాన్, జూన్ 12న యూఎస్‌ఏ, జూన్ 15న కెనడాతో తలపడుతుంది. పాకిస్థాన్ జూన్ 6న యూఎస్‌ఏతో, జూన్ 11న కెనడాతో, జూన్ 16న ఐర్లాండ్‌తో పాటూ ఇతర మూడు గ్రూప్ మ్యాచ్‌లు ఆడుతాయి.
2024 టీ20 ప్రపంచ కప్‌లో 20 జట్లు పోటీపడనున్నాయి. 2022లో ఆస్ట్రేలియాలో జరిగిన టోర్నమెంట్‌లో పాల్గొన్న 16 జట్ల నుండి ఈసారి మరో నాలుగు జట్లను పెంచారు. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు సూపర్ 8 రౌండ్‌కు చేరుకుంటాయి. దీనిలో జట్లను నాలుగు చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. A1, B2, C1, D2 ఒక గ్రూపుగా.. A2, B1, C2, D1 మరో గ్రూపుగా ఏర్పడుతుంది. ప్రతి సూపర్ 8 గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అయితే 2022లో మెల్‌బోర్న్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన ఇంగ్లండ్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి పురుషుల టీ20 ప్రపంచకప్‌లో కెనడా, అమెరికా, ఉగాండా మొదటి సారి ఆడనున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..