AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK vs RCB: మ్యాచ్‌ ఓడినా.. DJతో ఆర్సీబీ ప్లేయర్‌ను ట్రోల్‌ చేసిన సీఎస్‌కే! ఎందుకంటే..?

ఐపీఎల్ 2025లో RCB, CSK ని 50 పరుగుల తేడాతో ఓడించింది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో RCB 196 పరుగులు చేసి, CSK ని 146 పరుగులకు పరిమితం చేసింది. ఆర్సీబీ ఆటగాడు జితేష్ శర్మ తక్కువ పరుగులతో అవుట్ అయినందుకు, స్టేడియం డీజే "దోస, ఇడ్లీ, సాంబార్" పాట వేసి ట్రోల్ చేసింది.

CSK vs RCB: మ్యాచ్‌ ఓడినా.. DJతో ఆర్సీబీ ప్లేయర్‌ను ట్రోల్‌ చేసిన సీఎస్‌కే! ఎందుకంటే..?
Jithesh Sharma
Follow us
SN Pasha

|

Updated on: Mar 29, 2025 | 1:25 PM

క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఐపీఎల్‌ 2025లో భాగంగా శుక్రవారం చెపాక్‌ వేదికగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో రజత్‌ సేన 50 పరుగుల తేడా సూపర్‌ డామినేటింట్‌ విక్టరీ సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన సీఎస్‌కే ఓటమి పాలై.. ఎల్లో ఆర్మీని నిరాశకు గురిచేసింది. కాగా, ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓటమి పాలైనప్పటికీ.. ఆర్సీబీ ప్లేయర్‌ జితేష్‌ శర్మను మాత్రం ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేశారు. చెపాక్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన డీజేలో, జితేష్‌ శర్మ అవుటై వెళ్తున్న సమయంలో “దోస, ఇండ్లీ, సాంబార్‌, చట్నీ చట్నీ..” అనే పాట ప్లే చేసి.. జితేష్‌పై రివేంజ్‌ తీర్చుకున్నారు.

మరి జితేష్‌ అవుటైన తర్వాత ఈ పాట్‌ ఎందుకు ప్లే చేశారంటే.. ఈ మ్యాచ్‌ కంటే ముందు చెన్నై అనగానే మీకు ఏం గుర్తుకు వస్తుందని ఆర్సీబీ ఆటగాళ్లు ప్రశ్నించగా.. పలువురు ఆటగాళ్లు పలు రకాల సమాధానాలు చెప్పారు. జితేష్‌ శర్మ మాత్రం.. “దోస, ఇడ్లీ, సాంబార్, చట్నీ చట్నీ” కాస్త వెటకారంగా పాడాడు. ఇది సీఎస్‌కే అభిమానులకు కోపం తెప్పించింది. అందుకే సీఎస్‌కే సపోర్టర్‌గా ఉన్న డీజే జితేష్‌ అవుట్‌ అయి వెళ్తున్న సమయంలో ఆ పాటను ప్లే చేశాడు. అలాగే సీఎస్‌కే అభిమానులు కూడా అదే పాటను అందుకోవడం స్టేడియం హోరెత్తిపోయింది.

కాగా ఈ మ్యాచ్‌లో జితేష్‌ శర్మ 6 బంతుల్లో ఒక ఫోర్‌, ఒక సిక్స్‌తో 12 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. జితేష్‌ 12 పరుగులు మాత్రమే చేసినా.. అంతిమంగా ఆర్సీబీ విజయం సాధించింది. టాస్‌ ఓడిపోయిన తొలుత బ్యాటింగ్‌ చేసి.. 196 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. దాన్ని ఛేదించే క్రమంలో సీఎస్‌కే కేవలం 146 పరుగులు మాత్రమే చేసి.. 50 రన్స్‌ తేడాతో ఓటమి పాలైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంటర్‌ సిలబస్‌ మార్పుకు సర్కార్ నో.. మళ్లీ పాత చింతకాయ పద్ధతే!
ఇంటర్‌ సిలబస్‌ మార్పుకు సర్కార్ నో.. మళ్లీ పాత చింతకాయ పద్ధతే!
విమర్శలకు పంత్ స్ట్రాంగ్ రిప్లే..
విమర్శలకు పంత్ స్ట్రాంగ్ రిప్లే..
వేసవిలో ముఖం ప్రకాశవంతంగా ఉండాలంటే..పచ్చి పాలను ఈ విధంగా వాడండి
వేసవిలో ముఖం ప్రకాశవంతంగా ఉండాలంటే..పచ్చి పాలను ఈ విధంగా వాడండి
చుక్క నెత్తురు చిందించకుండానే పాక్‌ ఉక్కిరిబిక్కిరి!
చుక్క నెత్తురు చిందించకుండానే పాక్‌ ఉక్కిరిబిక్కిరి!
రైల్వే అభ్యర్ధులకు బిగ్‌ షాక్‌.. ఆ పరీక్షలు రద్దు చేసిన RRB..!
రైల్వే అభ్యర్ధులకు బిగ్‌ షాక్‌.. ఆ పరీక్షలు రద్దు చేసిన RRB..!
థియేటర్లలో స్టార్ హీరోస్ మూవీస్.. ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు,
థియేటర్లలో స్టార్ హీరోస్ మూవీస్.. ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు,
ప్రత్యర్థులను కవ్వించే విరాట్ ఇలా ఎందుకు మారాడో తెలుసా?
ప్రత్యర్థులను కవ్వించే విరాట్ ఇలా ఎందుకు మారాడో తెలుసా?
ఈ ఏడాది రెండో చంద్ర,సూర్య గ్రహణాలు ఎప్పుడు? సూత సమయం తెలుసుకోండి
ఈ ఏడాది రెండో చంద్ర,సూర్య గ్రహణాలు ఎప్పుడు? సూత సమయం తెలుసుకోండి
వేసవిలో కారు టైర్లు పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి? సెఫ్టీ ట్రిక్స్‌
వేసవిలో కారు టైర్లు పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి? సెఫ్టీ ట్రిక్స్‌
వార్‌ టెన్షన్‌.. ఇండియా, పాకిస్థాన్‌ మధ్యలో యూకే!
వార్‌ టెన్షన్‌.. ఇండియా, పాకిస్థాన్‌ మధ్యలో యూకే!