మినరల్ వాటర్ ప్రపంచంలో సరికొత్త రికార్డ్.. ది క్లియర్ ప్రీమియం వాటర్ బాటిల్..
దేశప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో నీటిపంపిణీ వ్యవస్థలో ఒక గేమ్ ఛేంజర్‌గా ఆవిర్భవించింది ది క్లియర్ ప్రీమియం వాటర్. ఎనర్జీ బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకదూర దృష్టి విధానంతో ఈ క్లియర్ ప్రీమియం వాటర్ ప్రారంభించింది. 2005లోఒక చిన్న వాటర్ బాటిల్‌తో ప్రారంభమైన ప్రస్థానం ప్రస్తుతం ఉన్నత శిఖరాలకు ఎదిగింది.
దేశప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో నీటిపంపిణీ వ్యవస్థలో ఒక గేమ్ ఛేంజర్‌గా ఆవిర్భవించింది ది క్లియర్ ప్రీమియం వాటర్. ఎనర్జీ బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకదూర దృష్టి విధానంతో ఈ క్లియర్ ప్రీమియం వాటర్ ప్రారంభించింది. 2005లోఒక చిన్న వాటర్ బాటిల్‌తో ప్రారంభమైన ప్రస్థానం ప్రస్తుతం ఉన్నత శిఖరాలకు ఎదిగింది. 2005లో ఎదుర్కొన్న తాగునీటి ఇబ్బందుల గురించి పరిశోధనలు చేసి అనేక విషయాలను గుర్తించింది. దీంతో ది క్లియర్ ప్రీమియం వాటర్ ను స్థాపించేందుకు నడుము బిగించింది. ప్రజల దాహాన్ని తీర్చడమేకాకుండా తనవంతు సామాజిక బాధ్యతగా పర్యావరణ పరిరక్షణకు తననిబద్ధతను కలిగి ఉంది ఈ సంస్థ. అందులోభాగంగా 2010లో విన్నూత్నమైన విధానానికి శ్రీకారం చుట్టింది.
వాటర్ బాటిళ్ల తయారీలో 40 శాతం తక్కువ ప్లాస్టిక్‌ను ఉపయోగించి సరికొత్త విధానాన్ని రూపొందించి. భారతదేశంలోనే ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిన సంస్థగా పేరుగణించింది. బాటిల్ నాణ్యత, నీటి శుద్ది, బ్రాండింగ్ లో నిబద్దతను కలిగి ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 80వేలకుపైగా వాటర్ బాటిల్ ప్రీమియం అవుట్ లేట్లు కలిగి ఉన్నట్లు తెలిపింది. 1000కి పైగా డిస్ట్రిబ్యూటర్లతో పాటూ ఐదు ప్రధాన విమానాశ్రయాలతో భాగస్వామ్యం అయి విక్రయిస్తున్నట్లు తెలిపింది. క్లియర్ వాటర్ ప్రీమియం సంస్థ ఇంతటి గొప్ప పేరు గణించేందుకు మంచి నాణ్యతను కలిగి ఉండటమే అంటున్నారు సంస్థ ప్రతినిధులు. ఈ వాటర్ బాటిల్ లో నీరు నింపే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా 11 దశల్లో శుద్ది చేయబడుతుందని చెబుతున్నారు.
దేశ వ్యాప్తంగా 121 నాణ్యతా తనిఖీ కేంద్రాల్లో పరీక్షించబడుతుందని చెబుతున్నారు. ప్రతి రోజూ 50 లక్షలకు పైగా బాటిళ్లు ఉత్పత్తి అవుతున్నట్లు చెబుతోంది ది క్లియర్ ప్రీమియం వాటర్. భారతదేశ వ్యాప్తంగా 2 అతి పెద్ద విశాలమైన ప్లాంట్లు, 40 కంటే ఎక్కువ కో-ప్యాకింగ్ యూనిట్లను కలిగి ఉంది. ది క్లియర్ ప్రీమియం వాటర్ మార్కెట్లో ఇంతటి గొప్ప విజయం సాధించడానికి అనేక కారణాలున్నాయన్నారు సంస్థ సీఈవో & ఫౌండర్ నాయన్షా. ఈ వాటర్ బాటిల్ ఉత్పత్తి చేసే ముందు ప్రజల ఆరోగ్యం, పర్యావరణ రక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు తెలిపారు. వ్యాపారం లాభాపేక్షకోసం కాకుండా ప్రజలకు మంచి రక్షిత, సురక్షితమైన తాగునీరును అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగామన్నారు.
కమ్యూనిటీ డెవలప్మెంట్ లో కూడా తమ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ విలువలే తమ సంస్థను సుదీర్ఘకాలం విజయవంతంగా ముందుకు నడిపించేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని క్లియర్ ప్రీమియం వాటర్ 2027 నాటికి ప్లాస్టిక్ – న్యూట్రల్ అవ్వడం తమ సంస్థ ముఖ్య ఉద్దేశం అన్నారు. 2030 నాటికి జీరో కార్బన్ ఉద్గారాలు, వాటర్ పాజిటివిటీని పొందడమే తమ లక్ష్యమన్నారు. 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో ఐఎస్ఓ 22000:2005, ఐఎస్ఓ 9001:2015, హెఎస్ఎసిపి, ఎఫ్ఎస్ఎస్ఏఐ, సీజిడబ్ల్యూ, బిఐఎస్, సిసిఎ, జిపిసిబి, నెఫ్రా, ఇపిఆర్సహా అనేక సర్టిఫికేషన్ కలిగి ఉన్నట్లు చెప్పారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..