Siddu Reddy Kandakatla: గొప్ప సేవా కార్యక్రమాల్లో సామాజికవేత్త సిద్ధు రెడ్డి కందకట్ల.. ప్రజలకు ఉచిత బట్టర్ మిల్క్
Siddu Reddy Kandakatla: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజలకు తాగునీరు, మజ్జిగ వంటివి అందించేవారంటే ఎంతో బాగుంటుందని అనుకుంటాము. అలాంటి మానవత్వం కలిగిన వాళ్లు కూడా ఉంటారు. ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు తన వంతు సహాయంగా సామాజిక వేత్త సిద్ధురెడ్డి కందకట్ల ముందుంటారు. రోడ్డు వెంట వచ్చిపోయే వారికి ఉచితంగా బట్టర్ మిల్క్‌ను అందిస్తూ ప్రజల హృదయాల్లో నిలిచిపోతున్నారు..

వరుసగా నాలుగో సంవత్సరం సిద్ధు రెడ్డి కందకట్ల అత్యంత ప్రశంసనీయమైన ఉచిత బట్టర్ మిల్క్ పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 6వ తేదీన ప్రారంభించారు. ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిద్దు రెడ్డిని ప్రజలు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి రోజు 5,000 నుండి 8,000 మందికి బట్టర్ మిల్క్ అందిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, క్యాబ్ డ్రైవర్లు, డైలీ లేబర్, ఇతర వాహనదారులు, ఆర్టీసీ డ్రైవర్లు, ప్రయాణికులు బట్టర్ మిల్క్ కేంద్రానికి చేరుకొని చల్లటి బట్టర్ మిల్క్ సేవిస్తూ ఎండ తాకిడి నుండి ఉపశమనం పొందుతున్నారని నిర్వాహకులు తెలిపారు. బట్టర్ మిల్క్ పంపిణీ ప్రక్రియ విషయంలో పరిశుభ్రత పాటిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ బట్టర్ మిల్క్‌లో కొత్తిమీర, పచ్చిమిర్చి, నల్లుప్పు, మిర్యాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, తదితర ఆరోగ్యానికి ఉపయోగపడే పదార్థాలు ఉపయోగిస్తున్నారు.
ప్రజలకు తాజాదనం, భద్రతను కాపాడుతూ ప్రతి దశలోనూ పరిశుభ్రతను నిర్ధారిస్తున్నారు. అయితే రోజుకు 150 కిలోల పెరుగు, మినరల్ వాటర్ అండ్ ఐస్: 800 లీటర్లు (4 డ్రమ్స్) పంపిణీలో పని చేసే సిబ్బంది 4 మంది పాల్గొంటారు.

సమాజ సంరక్షణకు హృదయపూర్వక చిహ్నంగా, సిద్ధు రెడ్డి వేసవి చివరి వరకు ప్రతిరోజూ నిర్వహిస్తారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ, ఈ చొరవ ఈ ప్రాంతమంతా ప్రజలకు ఉపశమనం, ఉల్లాసాన్ని అందిస్తుంది. రాబోయే రోజుల్లో ప్రజలు ఇంకా ఎక్కువ స్థాయిలో వస్తే మరింత పెంచి ప్రజలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎంత సంపాదించము అనేది కాదు అని సంపాదించిన దాంట్లో కాస్తయినా పేదలకు ఖర్చుపెట్టిన సమయంలో కలిగే ఆనందం ఎంతో అని సిద్దు రెడ్డి తెలిపారు.
“తీవ్రమైన వేడిలో ప్రజలు చల్లగా, హైడ్రేటెడ్ గా ఉండటానికి ఈ చిన్న అడుగు సహాయం. ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుందని, ఏదైనా అత్యవసరం ఉంటేనే తప్ప ఇంట్లో నుండి బయటికి రావద్దని, అత్యవసర పనిమీద బయటికి వస్తే మా బట్టర్ మిల్క్ కేంద్రాన్ని సందర్శించి చల్లటి బట్టర్ మిల్క్ తాగి ఎండ తీవ్రత నుండి ఉపశమనం పొందాలని సిద్దు రెడ్డి ప్రజలను కోరారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో ప్యూరిఫై వాటర్ ఫిల్టర్ల ద్వారా ప్రజలకు శుద్ధమైన మంచినీరు అందించేందుకు సిద్ధంగా ఉన్నామపి సిద్దు రెడ్డి తెలిపారు.
Location: Shamshabad NH 44, opposite Savera Hotel. Duration: Daily until the end of summer అందరికీ తెలియజేయండి – ఒక కప్పు బట్టర్ మిల్క్ వేసవి కాలంలో ఉపశమనం కలుగుతుంది.
